మెగాస్టార్ చిరంజీవి 151st మూవీగా ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఖైదీ నెంబర్ 150తో ఫిలిం ఇండస్ట్రీలోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. దశాబ్దకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నా..తన స్టామినా పెరిగిందే తప్ప తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు 151వ సినిమాను మరింత గ్రాండ్ లెవెల్ లో రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే.. దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఉయ్యాలవాడ జీవితాన్ని ఆవిష్కరించనుండగా.. ఇప్పుడు ఆ సినిమాకి టైటిల్ ను నిర్ణయించినట్లు తెలుస్తోంది. "మహావీర" అనే టైటిల్ ను ఖాయం చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది. తెలుగులో మాత్రమే ఈ సినిమా రూపొందించి ఉంటే.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి టైటిల్ సరిగ్గానే సూట్ అయ్యేది. కానీ తమిళ్.. మలయాళం.. హిందీ భాషల్లో కూడా విడుదల చేయనుండడంతో.. అన్ని భాషలకు సూట్ అయ్యేలా క్యాచీ టైటిల్ కోసం అన్వేషించారట దర్శకుడు సురేందర్ రెడ్డి అండ్ టీం.
చివరకు వీళ్ల సెర్చింగ్ మహావీర దగ్గర ఆగిందని.. త్వరలో టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా చేయించనున్నారని తెలుస్తోంది. ఆగస్టులో గ్రాండ్ లాంఛింగ్ ఈవెంట్ నిర్వహించి ఉయ్యలవాడను ప్రారంభిస్తారట. ఈ మహావీర చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ కు అవకాశం ఉండగా.. నయనతార ఒక రోల్ పోషించనుంది. మరో పాత్రకు ఐశ్వర్యారాయ్ ను ఒప్పించారనే టాక్ ఉంది. మూడో రోల్ కు చర్చలు తుది దశలో ఉన్నాయి.