మేమంతా ఒకటే అని మెగా హీరోలు ఎన్ని సార్లు చెప్పినా.. ఏదో ఒక సందర్భాన్ని పట్టుకుని ఇదిగిదిగో మెగా ఫ్యామిలీలో లుకలుకలు అంటూ ప్రచారం చేయడం చాలామందికి అలవాటయిపోయింది. మెగా ఫ్యామిలీ ఈవెంట్స్ లో కూడా పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం దీనికి మరింత ఆజ్యం పోస్తోంది. రీసెంట్ గా దీపావళికి మెగా ఫ్యామిలీ గేదరింగ్ లో కూడా పవన్ ఎక్కడా కనిపించలేదు. నేరుగా మాటలతో కాకపోయినా.. ఇలాంటివాటికి చెక్ పెట్టే ప్రయత్నం గతంలో కూడా పవన్ కూడా చేశాడు.
సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియోకు అన్నయ్యని పిలిచాడు. అయితే.. ఇప్పుడు ఈ మెగా బ్రదర్స్ అనుబంధం చాటే సంఘటన మరొకటి జరిగింది. కాటమరాయుడు సెట్స్ లో తెగ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ దగ్గరకు చిరంజీవి వచ్చారు. అది కూడా ఏమీ సాధారణమైన రాకపోకలు కాదు.. తన మూవీ ఖైదీ నెంబర్ 150కి సంబంధించిన కొన్ని సీన్స్ ను కాటమరాయుడు సెట్స్ లో చేయనుండడంతో.. ఇలా అన్నదమ్ములిద్దరూ ఒకే సెట్ లో కలుసుకునే సందర్భం వచ్చింది. మరి దేవుడు లాంటి అన్నయ్య పక్కన ఉంటే.. భక్తుడు లాంటి పవన్ మర్యాదలు చేయకుండా ఉంటాడా?
మెగాస్టార్ పవర్ స్టార్ లు ఇద్దరూ గంటకు పైగా ఆంతరంగికంగా చర్చించుకున్నారని చూసిన వారు చెబుతున్నారు. అయితే.. ఈ చర్చలు రాజకీయాలకు సంబంధించినవా.. సినిమాల గురించా.. లేక ఫ్యామిలీ రిలేషన్స్ గురించా అనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/