రాక్ స్టార్ రణబీర్ కపూర్ ని బిగ్ స్ర్కీన్ పై చూసుకుని నాలుగేళ్లు అవుతుంది. `సంజు` తో బ్లాక్ బస్టర్ అందుకున్న రాక్ స్టార్ ఏకంగా నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో రెండేళ్లు కరోనా కారణంగా ఎలాంటి కొత్త కమిట్ మెంట్లు జరగలేదు. అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్ట్ ల్ని పూర్తి చేసే పనిలో పడ్డారు. ఎట్టకేలకు ఈ ఏడాది `షంషేరా`..`బ్రహ్మాస్ర్త` చిత్రాలతో ప్రేక్షకుల ముందకు రావడానికి రెడీ అవుతున్నారు.
`బ్రహ్మాస్ర్త` లో రణబీర్ కపూర్ తో పాటు బిగ్ బీ అమితాబచ్చన్..కింగ్ నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాపై అంచనాలు పీక్స్ చేరాయి. యాక్షన్ అడ్వెంచర్ టీజర్ ఓ రేంజ్ లో ప్రేక్షకుల్ని ఆఆకట్టుకుంది. సెప్టెంబర్ 9న సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. అంతకు ముందు ట్రైలర్ ట్రీట్ ఇవ్వడానికి యూనిట్ సమాయత్తం అవుతోంది.
ఈనెల 15న భారీ ఎత్తున ట్రైలర్ రిలీజ్ కి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హిందీ..తెలుగుతో పాటు సౌత్ లో మిగతా భాషల్లోనూ భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. సౌత్ లో ఈ చిత్రానికి దర్శక దిగ్గజం ఎస్ ఎస్ . రాజమౌళి సమర్పుకుడిగా వ్యవహరిస్తున్నారు. తొలిసారి ఆయన ప్రజంటెర్ గా ఓ హిందీ సినిమా రిలీజ్ అవుతుంది.
దీంతో `బ్రహ్మాస్ర్త`కి మార్కెట్ లో మరింత బజ్ క్రియేట్ అవుతోంది. తాజాగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా భాగస్వామ్యం అవుతున్నట్లు సమాచారం. ఇటీవలే చిత్ర దర్శకుడు ఆయాన్ ముఖర్జీ..నటుడు రణబీర్ కపూర్ హైదరాబాద్ లో చిరంజీవిని కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కాంబినేషన్ మెగాస్టార్ ని కలవడం ఏంటని? సందేహాలు తెరపైకి వచ్చాయి.
తాజాగా `బ్రహ్మాస్ర్త` కి చిరు తెలుగు వెర్షన్ వాయిస్ ఓవర్ అందిస్తున్నట్లు లీకులందుతున్నాయి. హిందీ వెర్షన్ కి అమితాబ్ వాయిస్ ఓవర్ ఇవ్వగా.. తెలుగు వెర్షన్ కి మెగాస్టార్ అయితే బాగుంటుందని భావించి ఆయన్ని ఒప్పించడానికే చిత్ర దర్శకుడు కలిసినట్లు టాక్ వినిపిస్తుంది. చిరంజీవి కూడా సానుకూలంగానే స్పందించారుట.
ఈ విషయంపై రెండు..మూడు రోజుల్లో అధికారిక ప్రకటన రానుందని సమాచారం. దీంతో` బ్రహ్మాస్ర్త` తెలుగుల రిలీజ్ పై చాలా ఏకాగ్రత్తనే పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇటీవలే రణబీర్ కపూర్ సినిమా ప్రచారంలో భాగంగా విశాఖపట్టణం వెళ్లిన వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఇక రిలీజ్ సమయంలో ప్రచారం పై యూనిట్ మరింత శ్రద్ద వహించే అవకాశం ఉంది.