ఇప్పుడు కొత్తగా టాలీవుడ్ లో వినిపిస్తున్న విషయం ఏంటంటే.. అఖిల్ రిలీజ్ అయ్యేవరకు మెగాస్టార్ చిరంజీవి వెయిట్ చేస్తారట. అసలు అఖిల్ కు చిరంజీవికీ లింక్ ఏంటంటే.. అఖిల్ అక్కినేని డెబ్యూ ఫిలిం 'అఖిల్' రిలీజ్ అయ్యి దాని రిజల్టు వచ్చాక వివి వినాయక్ డైరక్షన్ లో మెగాస్టార్ తన 150వ సినిమాను ప్రకటిస్తారట. అసలు ఈ విషయాన్ని వింటేనే కాస్త సర్ ప్రైజింగ్ గా లేదూ??
నిజానికి వినాయక్ డైరక్షన్ లో చిరంజీవి కనుక సినిమా చేయాలంటే.. దానికి అఖిల్ ను చూడాల్సిన పని లేదు. అఖిల్ సినిమా రిజల్టు ఎలా ఉన్నా కూడా.. తనతో ఠాగూర్ - కొడుకు చెర్రీతో నాయక్ సినిమాను చూసిన వినాయక్ టాలెంటుకు ఇప్పుడు కొత్తగా మెగా క్యాంపు ఇచ్చే కొత్త విశ్లేషణలు ఏముంటాయ్. ఒకవేళ ఈ న్యూస్ కేవలం రూమర్ అనుకుందాం. అయితే ఈ రూమర్లు కేవలం మెగా 150వ సినిమా ప్రకటించట్లేదు కాబట్టి ఆ గ్యాప్ ను కవర్ చేయడానికి క్రియేట్ చేసినవే అనుకోవాలా? లేకపోతే వినాయక్ తో కలసి ప్రెస్ మీట్ ను పెట్టి చెర్రీ ఆ సినిమా (ప్రాబబ్లీ.. కత్తి రీమేక్) గురించి చెబితే బాగుంటుంది కాబట్టి.. మనోళ్ళు ఇలా వెయిట్ చేస్తున్నారేమో మరి.
ఒకవేళ నిజంగానే అఖిల్ రిజల్టు కోసం వెయిట్ చేస్తుంటే మాత్రం.. ఖచ్చితంగా అది టూ మచ్ అనే చెప్పాలి. సర్లేండి.. ఆ లెక్కన చూసినా కూడా మెగాస్టార్ 150వ సినిమా ప్రకటన మరో రెండు వారాల్లో చెప్పేయాలి. అసలు చరణ్ బాబు ఇంకా అమెరికా నుండి రాకుండా.. ఆ మెగా ప్రకటన ఎప్పుడు చేస్తారో ఏంటో...