టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. అతడి సతీమణి ఉపాసనలిద్దరూ జంతు ప్రేమికులన్న సంగతి తెలిసిందే. ఆ ప్రేమను వాళ్లు పలుమార్లు బయటపెట్టుకున్నారు. చరణ్-ఉపాసనకు సంబంధించి ఏవైనా లీజర్ ఫొటోస్ బయటికి వస్తే అందులో తప్పుకుండా జంతువులు కనిపిస్తాయి. ముఖ్యంగా గుర్రాల్ని పెంచడం వీళ్లిద్దిరికీ చాలా ఇష్టం. వేరే జంతువుల్ని కూడా ఆదరిస్తారు. ఐతే వీళ్లిద్దరి జంతు ప్రేమ హద్దులు దాటిపోవడంతో చిరు నుంచి వార్నింగ్ కూడా తీసుకోవాల్సి వచ్చిందట. ఇంట్లో మనుషుల కంటే జంతువులు ఎక్కువైపోతున్నాయని.. ఇక మిమ్మల్ని బయటికి పంపించేస్తానని చిరు వాళ్లను హెచ్చరించాడట. అయినా కూడా తామేమీ పట్టించుకోలేదని తరచుగా కొత్త జంతువులు ఇంటికి వస్తూనే ఉంటాయని చరణ్ తెలిపాడు.
పుట్టిన రోజో.. పెళ్లి రోజో.. ఇంకేదో వేడుకో వస్తే అందరిలాగా తాము వస్తువులు గిఫ్ట్ ఇచ్చుకోమని.. జంతువుల్నే పరస్పరం బహుమతిగా ఇచ్చుకుంటామని చరణ్ తెలిపాడు. ఇలా రోజు రోజుకూ జంతువులు పెరుగుతూ పోయాయని.. ఇప్పుడు వాటి కోసం ప్రత్యేకంగా ఒక ఫామ్ హౌస్ కట్టించాల్సిన పరిస్థితి తలెత్తుతోందని చరణ్ చెప్పాడు. అమల నడిపే బ్లూ క్రాస్ సొసైటీలో జంతువుల సంఖ్య పెరిగిపోతే.. తమ ఇంటికే పంపుతారని చరణ్ చెప్పాడు. అంతే కాక జూలో జంతువుల్ని సరిగా చూసుకోవట్లేదని తెలిసినా అధికారులు తమ దగ్గరికి కొన్నింటిని పంపిస్తారన్నాడు. ఇలా రోజు రోజుకూ తమ వద్ద జంతువులు పెరిగిపోతున్నాయని.. అయినా వాటిని సంతోషంగా పెంచుకుంటున్నామని.. అన్నింట్లోకి తనకు గుర్రాలంటే చాలా ఇష్టమని చరణ్ తెలిపాడు.