కొండవీటి రాజా...సుప్రీంహీరో చిరంజీవి నటించిన క్లాసిక్ మూవీ ఇది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా 1986 జనవరి 31న విడుదలైంది. దేవివరప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నేటితో ఈ మూవీకి 35 ఏళ్లు. ఈ సందర్భంగా సినిమా సంగతులు సహా నాటి జ్ఞాపకాల్లోకి వెళితే..
రాజా అనే వ్యక్తి రత్నగరి అనే గ్రామానికి పని కోసం వెతుక్కుంటూ వస్తాడు. ఈ గ్రామంలో ఒక పురాతనమైన కోట.. జలదుర్గం లాంటి చారిత్రక ప్రదేశాలు ఉంటాయి. బస్సు దిగగానే రాజాకి ఆ ఊరి పోస్టు మాస్టరు కూతురు రాణి పరిచయమై వాళ్ళ ఇంట్లో అద్దెకు దిగుతాడు. అదే ఊళ్లో ఉన్న వెంకట్రాయుడికి పద్మ అనే కూతురు ఉంటుంది. ఈమె అతనికి మొదటి భార్య కూతురు. పద్మ సవతి తల్లి చేతిలో బాధలు పడుతూ ఉంటుంది. తండ్రి కూడా ఆమెను ఎదిరించలేకుండా ఉంటాడు. రత్నగిరి ఊరిలోని కోటలో నిధినిక్షేపాలు కాజేయాలని ఊరి పెద్ద పాపారాయుడు.. అతని అనుచరులు ప్రయత్నిస్తుంటారు. వారు చేసే ఆగడాలను అడ్డుకుంటూ ఉంటాడు రాజా. అతణ్ణి పద్మ.. రాణి ఇద్దరూ ప్రేమిస్తారు. వారిలో రాణి అంటేనే రాజాకు ఇష్టం. తరువాత పద్మ తన చనిపోయిన అక్క కూతురు అని తెలుస్తుంది. తన అక్క చావుకు కూడా ఆ ఊరి పెద్ద రాయుడే కారణమని తెలుసుకొని.. మొత్తానికి వారిని చట్టానికి పట్టించి.. నిధిని ప్రభుత్వానికి అప్పచెబుతాడు. పద్మను మానభంగం చేయబోతున్న రాయుడు కొడుకును రాణి చంపేస్తుంది. చివరకు రాజా- పద్మ పెళ్ళి చేసి తాను జైలుకు వెళ్తుంది రాణి.
ఈ సినిమాలో చాలా సన్నివేశాలు గద్వాల పరిసరప్రాంతాల్లో చిత్రీకరించారు. దాదాపు నెలరోజులకు పైగా గద్వాల కోటలో షూటింగు జరిగింది. కోట చుట్టూ ఉన్న కందకంలో కోటలోపలి బావి దగ్గర ఫైటింగ్ లు చిత్రీకరించారు. కోటలోపల ఆలయ సముదాయంలో అంగాంగ వీరాంగమే పాట చిత్రీకరణ జరిగింది. దాదాపు సినిమా చివరి ఘట్టాలన్నీ కోటలోనే చిత్రీకరించారు. గద్వాల పరిసరాల్లోని అనంతపూర్ గ్రామంలోని ప్రధాన కూడలి అయిన గాంధీ విగ్రహం వద్ద.. బిసి కాలనీలోని చెట్టు కింద ఉన్న తులసి మొక్కకు పూజలు.. పరిసర కాలనీల్లోని రహదారులలో పలు దృశ్యాలు చిత్రీకరించారు.
ఇందులో రాజా గా చిరంజీవి.. రాణి గా విజయశాంతి ..పద్మ గా రాధ.. పాపారావు గా రావు గోపాలరావు ..వెంకట్రాయుడు గా కైకాల సత్యనారాయణ.. పార్వతమ్మ గా నిర్మలమ్మ నటించారు.
ఈ చిత్రానికి కథ- మాటలు పరుచూరి బ్రదర్స్ రాయగా.. పాటలను వేటూరి సుందరరామ్మూర్తి రచించారు. చక్రవర్తి స్వరకల్పనతో పాటలు పసందుగా సాగాయి. మంచమేసి దుప్పటేసి... పాట అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. ఈ పాటను చిరంజీవి- విజయశాంతిపై చిత్రీకరించారు. ``ఊరికంత నీటుగాడే...`` పాట హైలైట్. అంగాంగ వీరాంగమే... పాటలో చిరంజీవి- విజయశాంతి- రాధ ముగ్గురూ నర్తించారు. ఇక ఐటమ్ గాళ్స్ జయమాలిని- సిల్క్ స్మిత- అనురాధ లతో చిరు స్టెప్పులు గొప్పగా అలరించాయి. ఈ చిత్రం చక్కని వసూళ్లతో చాలా కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. చిరంజీవి అభిమానుల కు కొండవీటి రాజా ఓ మరపురాని చిత్రంగా నిలిచింది.