స్నేహానికి విలువిచ్చి గౌరవం కాపాడేందుకు ఎంత దూరమైనా వెళతారు మెగాస్టార్ చిరంజీవి. తన లైఫ్ లో కెరీర్ లో నియమనిబంధనలను తూ.చ తప్పక ఆచరించిన మహనీయుడు ఆయన.
తన అభిమానులకు ఎప్పుడూ కష్టం రాకుండా చూసుకోవాలని తపించే చిరు నటరంగంలో ఉంటే వారికి చేదోడు వాదోడుగా ఉంటూ అవసరం మేర సాయం చేస్తున్నారు. ఇక ఇరుగు పొరుగు పరిశ్రమల్లో తన స్నేహితులను ఎలాంటి కారణాలతోనూ విడిచిపెట్టరు. వారిని పిలిచి గౌరవిస్తారు. వారితో స్నేహం కోసం ఏదైనా చేస్తారు!
ఇటీవల తన స్నేహితుడు నాగార్జున వారసుడు చై బాలీవుడ్ ఎంట్రీ మూవీ కోసం చిరు చాలా చేశారు. ఇక ఈ సినిమాని నిర్మించిన హిందీ స్టార్ అమీర్ ఖాన్ తో స్నేహం దృష్ట్యా తానే సమర్పకుడిగా మారి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయించారు. అంతేకాదు ఈ మూవీకి బోలెడంత ప్రచారం కూడా చేసారు. అయితే ఆయన మంచి మనసుతో ఎన్ని చేసినా కానీ అవేవీ కలిసి రాలేదు. అల్టిమేట్ గా ఈ మూవీ కి నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. అమీర్ ఖాన్ మ్యాజిక్ పని చేయలేదని మాతృక `ఫారెస్ట్ గంప్` తో పోలిస్తే రీమేక్ తేలిపోయిందని విమర్శించారు.
అమీర్ ఖాన్- కరీనా కపూర్ - నాగ చైతన్య నటించిన `లాల్ సింగ్ చడ్డా` నేడు రిలీజ్ కాగా తెలుగు హిందీ సహా ఇతర భాషల్లోనూ సమీక్షలు నెగెటివ్ గా వచ్చాయి. ఫారెస్ట్ గంప్ సినిమా చూసిన వారికి లాల్ సింగ్ చడ్డా నిజాయితీ లేని ప్రయత్నంగా కనిపించింది.
మాతృక చూడని వారికి ఇది పెద్దగా అర్ధం కాదని కూడా విమర్శలొచ్చాయి. అమీర్ అతని తల్లి పాత్ర ఉన్న ట్రాక్ మాత్రం ప్రశంసలు పొందింది. ఇతర చిత్రం అంతగా ఆకట్టుకోలేదని విమర్శలొచ్చాయి. కారణం ఏదైనా అమీర్ ఖాన్ భయపడిందే జరిగింది. తన సినిమా కూడా ఇటీవల ఫ్లాపులైన ఇతర బాలీవుడ్ పెద్ద సినిమాల్లానే తేలిపోయింది.
అక్షయ్ కుమార్ నటించిన పృథ్వీరాజ్ సామ్రాట్ తర్వాత అమీర్ లాల్ సింగ్ చడ్డా పైనా పెదవి విరుపులు హిందీ పరిశ్రమకు అశుభ సూచకంగానే కనిపిస్తున్నాయి. అయితే దీనిని ఒక సౌత్ దర్శకుడు అయిన పూరి జగన్నాథ్.. లైగర్ ని బరిలో దించి చెరిపేస్తాడేమో వేచి చూడాలి.