మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పూర్తి అవ్వాల్సిన షూటింగ్ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. ఎక్కడ రాజీ పడకుండా దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ చరణ్ లు సైరా ను తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కాల్సి ఉంది. సైరా ఆలస్యం అవుతూ వస్తున్న నేపథ్యంలో కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ఎదురు చూస్తున్నాడు. తాజాగా చిరంజీవితో కొరటాల ఫొటో షూట్ చేయించినట్లుగా తెలుస్తోంది.
కొరటాల శివ సినిమాలో చిరంజీవి రైతు పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు చిరంజీవి ఏ సినిమాలో కనిపించని విధంగా ఈ చిత్రంలో చూపించాలని కొరటాల ఆశ పడుతున్నాడు. అందుకోసం చాలా బరువు తగ్గడంతో పాటు, విభిన్నమైన మేకోవర్ లో చిరంజీవిని చూపించాలని కొరటాల భావిస్తున్నాడు. అందుకోసం తాజాగా కొన్ని స్కెచ్ లు వేయించిన కొరటాల అందుకు తగ్గట్లుగా మేకప్ చేసి చిరంజీవితో ఫొటో షూట్ చేయించినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
మెగాస్టార్ చిరంజీవి సైరాను ఎప్పుడు పూర్తి చెస్తే అప్పుడు వెంటనే తన సినిమాను మొదలు పెట్టేందుకు కొరటాల అన్ని విధాలుగా సిద్దంగా ఉన్నాడు. ఈ చిత్రం కోసం ఇద్దరు హీరోయిన్స్ ను దర్శకుడు కొరటాల పరిశీలిస్తున్నాడు. శృతి హాసన్ మరియు తమన్నాల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే షూటింగ్ ప్రారంభం సమయానికి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సినిమా ఎప్పుడు ప్రారంభం అయినా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా రామ్ చరణ్ నిర్మించబోతున్న విషయం తెల్సిందే.