మెగా ఫ్యాన్స్ కు నిన్నటి ఉగాది రోజు ప్రత్యేకంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి నిన్నటి నుండి సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు చేరువగా ఉండేందుకు రెడీ అయ్యాడు. ట్విట్టర్ ఇంకా ఇన్ స్టాగ్రామ్ ల్లో ఖాతాను ఓపెన్ చేయడం జరిగింది. మొదటి రోజు ట్విట్టర్ లో చిరంజీవి నాలుగు ట్వీట్స్ చేశాడు. మొదటగా అందరికి ఉగాది శుభాకంక్షలు తెలియజేసిన చిరంజీవి ఆ తర్వాత కోవిడ్ 19 తో జాగ్రత్తగా ఉండాలి ఇంటికే పరిమితం అవ్వాలనే సందేశాన్ని ఇస్తూ రెండవ ట్వీట్ చేశాడు.
ఇక మూడవ ట్వీట్ ను ‘ఆర్‌ఆర్‌ఆర్’ మోషన్ పోస్టర్ గురించి చేశాడు. ఇప్పుడే మోషన్ పోస్టర్ చూశాను. కన్నుల పండుగగా ఉందంటూ రాజమౌళి.. ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ లను అభినందించాడు. ఇక నాల్గవ ట్వీట్ గా తన తల్లి అంజనా దేవితో దిగిన ఫొటోను షేర్ చేసి హోమ్ టైం.. మామ్ టైం అంటూ ట్వీట్ చేశారు. ఈ సమయంలో పెద్దలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటూ చిరంజీవి సూచించారు.
ఇక మొదటి రోజు మెగాస్టార్ ఫాలోవర్స్ సంఖ్య లక్షన్నర దాటింది. మొదటి రోజు ఆయన ట్వీట్స్ కు భారీగా లైక్స్ కామెంట్స్ ఇంకా రీ ట్వీట్స్ వచ్చాయి. ఇవే కాకుండా చిరంజీవిని ట్విట్టర్ లోకి ఆహ్వానిస్తూ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. నాగార్జున.. మాజీ హీరోయిన్స్ సుహాసిని... రాధిక లు ట్వీట్స్ చేయగా వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు. రాజమౌళి కూడా ఉగాది శుభాకాంక్షలు చెబుతూ చిరంజీవిని ట్విట్టర్ లోకి ఆహ్వానిస్తూ ట్వీట్ చేయగా దానికి రీ ట్వీట్ చేసిన చిరు కృతజ్ఞతలు తెలియజేశాడు.
మొత్తానికి మొదటి రోజు చిరు ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గానే కనిపించారు. ముందు ముందు కూడా చిరు ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పండగకు పబ్బానికి కాకుండా రెగ్యులర్ గా చిరు ట్వీట్స్ చేయాలని ఆశిస్తున్నారు. ఇక చిరు తన 152 మూవీ ఆచార్య అప్ డేట్స్ ను కూడా రెగ్యులర్ గా ఇవ్వాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.