మెగాస్టార్ చిరంజీవి 1980 మరియు 90ల్లో ఒక్క రోజులో రెండు మూడు షిఫ్ట్ ల్లో రెండు మూడు సినిమాల్లో నటించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు హీరోలు ఒక సినిమా పూర్తి అయితే కాని మరో సినిమా కు క్లాప్ కొట్టకూడదు అనే పట్టుదలతో పంతంతో ఉంటున్నారు. చాలా మంది హీరోలు ఒకే సారి రెండు మూడు సినిమాలు చేసే అలవాటుకు దూరంగా ఉంటున్నారు. కాని పరిస్థితి చూస్తుంటే మళ్లీ పాత రోజులు వచ్చేలా ఉన్నాయి అనిపిస్తుంది. ఆ పాత రోజులను మళ్లీ చిరంజీవి గుర్తు చేస్తున్నారు. ఒకే సారి మూడు నాలుగు సినిమాలు చేసిన ఘనత చిరంజీవికి ఉంది. ఇప్పుడు అదే తరహాలో సినిమాలు చేసేందుకు చిరంజీవి సిద్దం అయ్యారు. ఇప్పటికే ఆచార్య షూటింగ్ పూర్తి అయ్యింది.. మరో వైపు లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్.. వేదాళం రీమేక్ భోళా శంకర్ మరియు బాబీ దర్శకత్వంలో ఒక సినిమా ను చిరంజీవి సమాంతరంగా షూటింగ్ ను చేస్తున్న విషయం తెల్సిందే.
ఈ మూడు సినిమాల షూటింగ్ వివిధ దశల్లో ఉన్నాయి. ఏ సమయంలో ఏ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడో కాని మూడు సినిమాల షూటింగ్స్ కూడా జరిగి పోతూనే ఉన్నాయి. మొన్నటి వరకు కరోనాతో బాధ పడ్డ చిరంజీవి మరి కొన్ని రోజుల పాటు షూటింగ్ లకు హాజరు కాకపోవచ్చు అని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. నయనతార తో కలిసి చిరంజీవి షూటింగ్ లో సందడి చేస్తున్నారట. హైదరాబాద్ లో నయనతార ను ఇటీవలే మీడియా వారు క్లిక్ మనిపించిన విషయం తెల్సిందే. గాడ్ ఫాదర్ సినిమా కోసం ఆమె హైదరాబాద్ వచ్చింది అనే విషయంను ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. చిరంజీవి ఒక వైపు గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ మరో షిప్ట్ లో ఆచార్య సినిమాకు డబ్బింగ్ చెబుతున్నారు.
ఒక హీరో ఒకే రోజు రెండు సినిమాలకు వర్క్ చేయడం అనేది ఈమద్య కాలంలో చూడటం చాలా అరుదు. చిరంజీవి వంటి సీనియర్ హీరో ఇలా రెండు షిప్ట్ లుగా వర్క్ చేయడం నిజంగా అభినందనీయం అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఈ వయసులో ఆయన సినిమాలు వదిలేసి హాయిగా లైఫ్ ను ఎంజాయి చేయవచ్చు. కాని ఆయన అభిమానులను మరియు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే ఉద్దేశ్యంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను విడుదల చేస్తూ ఉండటం అభినందనీయం అంటూ మీడియా వర్గాల వారు అంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య సినిమా షూటింగ్ చాలా నెలల క్రితం పూర్తి అయ్యింది. విడుదల తేదీ దూరం ఉండటంతో డబ్బింగ్ కార్యక్రమాలు వాయిదా వేస్తూ వచ్చారు. తాజాగా చిరంజీవి ఆ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేశారు. గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే ఆచార్య సినిమా కు డబ్బింగ్ పూర్తి చేశారు. గాడ్ ఫాదర్ సినిమా షెడ్యూల్ ను మూడవ వారంకు పూర్తి చేసి వెంటనే భోళా శంకర్ సినిమా లేదా బాబీ దర్శకత్వంలో సినిమా కు డేట్లు ఇవ్వాల్సి ఉందట. మొత్తానికి చిరంజీవి జోరు చూస్తుంటే అభిమానుల్లో జోష్ కలుగుతుందట. ఈ ఏడాదిలో చిరంజీవి నుండి ఆచార్య తో పాటు గాడ్ ఫాదర్ సినిమా రాబోతుంది. కాలం సహకరిస్తే భోళా శంకర్ సినిమాను కూడా చిరంజీవి ఇదే ఏడాదిలో తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.