బాలీవుడ్ లో 'కాస్టింగ్ కౌచ్' ఉంది... కానీ ఎవరూ ఫోర్స్ చెయ్యరు

Update: 2020-05-08 02:30 GMT
'కాస్టింగ్ కౌచ్' మరియు 'మీటూ' ఉద్యమాలు ప్రపంచ వ్యాప్తంగా చిత్ర పరిశ్రమను కుదిపేసిన ఉద్యమాలు. సినీ ఇండస్ట్రీలో వేధింపులు సర్వసాధారణమంటూ ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు బహిరంగంగానే చెప్పారు. కొందరైతే ఆ దర్శక నిర్మాతల పేర్లను డైరెక్టుగా బయట పట్టేశారు. మరికొందరు ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఎందుకని సైలెంట్ గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవానికి ఈ సమస్య ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కాదు ప్రతీ రంగంలోనూ ఉన్నదే. మన టాలీవుడ్ లోనూ ఈ విషయంపై నటీమణులు చాలా సందర్భాలలో స్పందించారు. ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ బ్యూటీ చిత్రాంగద సింగ్ 'కాస్టింగ్ కౌచ్' గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.

సినీ రంగంలో కూడా జాబ్ ఆఫర్ చేసి కమిట్మెంట్ అడిగేవాళ్ళు ఉన్నారని ఒప్పుకుంది. 'కాస్టింగ్ కౌచ్'లు కేవలం ఒక బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదని.. ప్రతీ రంగంలో ఉన్న ఆడవాళ్ళకి జాబ్ ఆఫర్ చేసి సెక్సువల్ ఫేవర్ అడిగేవారు ఉన్నారని చెప్పుకొచ్చింది. అయితే దానికి ఒప్పుకోవాలా వద్దా అనేది వారి ఓన్ ఛాయిస్ అని.. అలాంటివి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయమని స్పష్టం చేసింది. అంతేకాని దీని కోసం బలవంతం చేయడం అంటూ ఏమీ ఉండదని చెప్పింది. చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ తగినంత గౌరవం ఉందని చెప్పారు. ఒకవేళ ఎవరైనా ఆఫర్స్ తగ్గడంతో ఆ మార్గాన్ని ఎన్నుకున్నప్పటికీ వారిని జడ్జ్ చేసేవారు ఉండరని.. ఆమెకు కంపర్టబుల్ అనిపిస్తే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని చెప్పింది. మోడలింగ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి కాస్టింగ్ కౌచ్ ఎదుర్కుంటున్నానని.. బాలీవుడ్ లో అడుగుపెట్టిన తర్వాత కూడా ఇంకా అలాంటివి ఎదురవుతున్నాయని.. కానీ ఎవరూ ఫోర్స్ చేయలేదని చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉండగా లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ ఈ సమయాన్ని షార్ట్ ఫిలిమ్స్ కోసం స్క్రిప్ట్ రాసుకోవడానికి వినియోగించుకుంటోందట. ప్రస్తుతం చిత్రాంగద సింగ్.. అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తున్న ‘బాబ్‌ బిస్వాస్‌’ సినిమాలో నటిస్తోంది. దియా ఎ. ఘోష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షారుక్‌ ఖాన్, గౌరీ ఖాన్‌ (షారుక్‌ ఖాన్‌ భార్య), సుజోయ్‌ ఘోష్, గౌరవ్‌ వర్మ లు కలిసి నిర్మిస్తున్నారు. మోడలింగ్ ద్వారా తన కెరీర్ మొదలు పెట్టిన చిత్రాంగద సింగ్ సినిమా రంగం వైపు అడుగు వేసింది. సుధీర్ మిశ్రా దర్శకత్వంలో వచ్చిన 'హజారోన్ క్వాసీన్ ఐసీ' చిత్రం ద్వారా చిత్రాంగద తెరంగ్రేటం చేసింది. ఆ తర్వాత 'కాల్' ‘సారీ భాయ్' ‘యే సాలి జిందగి' ‘దేశీ బాయ్స్' 'జోకర్' 'ఇంకార్' 'ఐ మి ఔర్ మే' చిత్రాల్లో నటించింది. 'ఇంకార్' చిత్రంలో చిత్రాంగద పెర్ఫార్మెన్స్‌ కు మంచి పేరొచ్చింది. సౌత్ లో సూర్య హీరోగా నటించిన 'అంజాన్' (తెలుగులో 'సికిందర్') సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది.
Tags:    

Similar News