ఫోటో స్టొరీ: శ్వేతవర్ణపు సీతాకోక చిలుక

Update: 2019-04-05 14:30 GMT
చిత్రాంగద సింగ్ పాపులర్ మోడల్ కం బాలీవుడ్ యాక్ట్రెస్.  అక్షయ్ కుమార్ తో 'దేశి బాయ్స్' లాంటి క్రేజీ సినిమాల్లో నటించినా ఎందుకో పెద్ద బ్రేక్ అయితే రాలేదు.  కానీ బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ విషయం లో మాత్రం సూపర్ సక్సెస్ సాధించింది .. కాలేజి రోజుల్లోనే బ్రాండ్స్ కు మోడల్ గా నటించడం మొదలు పెట్టిన ఈ భామ ఇప్పటి వరకూ దాదాపుగా డజనుకు పైగా ప్రముఖ బ్రాండ్స్ కు అంబాజిడర్ గా వ్యవహరించింది. ఎయిర్ టెల్.. పూమా.. లాంటి పెద్ద బ్రాండ్ కూడా ఈ భామ లిస్టులో ఉన్నాయి.

ఈ జెనరేషన్ భామల్లాగే చిత్రాంగద సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్.  రెగ్యులర్ గా హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ వాతావరణం లో వేడి పెంచడమే కాదు..  నెటిజనుల హృదయాలను ఇంటర్నెట్ గ్రిల్ పై కబాబుల్లాగా దోరగా వేపుడు చేస్తుంది. కాసేపటి క్రితం మరోసారి అలాంటి పనికి పూనుకుంది.  శ్వేతవర్ణపు సీతాకోక చిలుక లాగా ఒక డిజైనర్ డ్రెస్ వేసుకొని ఫోటోలకు పోజిచ్చింది.  ఫిలింఫేర్ అవార్డ్స్ కోసం ఇలా తయారయిందట.  ఫోటోలను లేట్ గా పోస్ట్ చేసినందుకు క్షమించమని అడగడమో ఏంటో కానీ 'లేట్ గ్రామ్' అనే హ్యాష్ టాగ్ ఇచ్చింది.

ఇక ఈ డ్రెస్ లో క్లీవేజ్ అందాలను ఫుల్లుగా ఆరేయడంతో పాటుగా.. మెరుస్తూ ఉండే రెడ్ కలర్ లిప్ స్టిక్ వేసుకొని నవ్వుతూ పోజిచ్చింది. జుట్టును కాస్త చిందరవందరగా వదిలేసినట్టుగా స్టైలింగ్.. వెడల్పాటి సన్నటి తాళ్ళలాంటి చెవి రింగులు.. వైట్ కలర్ నెయిల్ పాలిష్.. అబ్బో కాంబినేషన్ అదిరిపోయింది.  నెటిజనులకు ఈ గెటప్ ఆ పోజు సూపర్ గా నచ్చాయి.  వైట్ బటర్ ఫ్లై.. రెడీ టూ ఫ్లై అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు.  ఒకడు మాత్రం వాతావరణ శాఖలో పనిచేసే వ్యక్తిలా ఉన్నాడు.. "టెంపరేచర్ 40 డిగ్రీలు.. 46 డిగ్రీలకు తీసుకొచ్చావ్" అన్నాడు. ఆ ఆరు డిగ్రీలు చిత్రాంగద పుణ్యమే!
Tags:    

Similar News