ఆ మధ్యన వచ్చిన టీజర్ చూసి టాలీవుడ్ అప్పుడే అనుకుంది.. ఏంటో ఈసారి మ్యాజిక్ గట్టిగా జరిగేలా ఉందని. ఎందుకంటే ఒక పాట తాలూకు ట్యూన్.. విజువల్స్.. హీరో హీరోయిన్ల కెమిస్ర్టీ.. ఇన్నేసి బాగుండటం అనేది ఈ మధ్యకాలంలో రేర్ గా చూస్తున్నాం. 2017 మొదట్లో అమ్మడు కుమ్ముడు అంటూ మెగాస్టార్ 150వ సినిమాలో అలాంటి ఫీట్ జరిగితే.. సంవత్సరం మొత్తంలో మళ్ళీ ఆ తరహా పాట కనిపంచలేదు. ఎట్టకేలకు నాగశౌర్య అలాంటి పాటతో వచ్చి ఇంప్రెస్ చేస్తున్నాడు.
'చూసి చూడంగానే నచ్చేశావే' అంటూ సాగే పాట వీడియో ఇప్పుడు ఫిలిం నగర్లో పలు డిస్కషన్లకు కేంద్ర బింధువైంది. 'ఛలో' సినిమాలోని ఈ పాటను ముఖ్యంగా స్వరబ్రహ్మ మణిశర్మ కొడుకు మహతి స్వరసాగర్ స్వరపరిచిన తీరు అదిరిపోయింది. పాటలోని మెలోడీ ఒకెత్తయితే.. ఆ పాట కోసం మనోడు అందించి వాయిద్యాల కూర్పు మరో స్థాయిలో ఉందంతే. ఇకపోతే పాటలో నాగశౌర్య తాలూకు లవర్ బాయ్ లుక్స్.. అలాగే కొత్తమ్మాయి రష్మిక మందన్నా తాలూకు అందం గిలిగింతలు పెట్టేస్తున్నాయి. వట్టి చూపులతోనే కెమిస్ర్టీ బాగా కుదిరిందని చెప్పాలి.
ఒకవైపు ఈ పాట వింటుంటే.. ఒకప్పుడు మణిశర్మ సమరసింహారెడ్డి.. అన్నయ్య.. చూడాలని ఉంది వంటి సినిమాల్లో కొట్టిన మెలోడీల తరహాలో వినీవినగానే నచ్చేస్తోంది. మరోవైపు ఇలాంటి మంచి పాటలను లేటుగా రిలీజ్ చేస్తూ 'ఛలో' టీమ్ బాగా ఊరించేస్తున్నారు. ఈ పాటను విన్న తరువాత ఈ ఆల్బమ్ లోని మిగతా పాటలను వినేయాలని అనిపిస్తోంది. త్వరగా సాంగ్స్ రిలీజ్ చేయండమ్మా!!
Full View