ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాసే చిత్రాలన్నీ మాస్ ఎంటర్ టైనర్సే. చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా ఈ జానర్ సినిమాలన్నింటినీ ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.
ఇలా ప్రేక్షకులతో ఈలలు వేయించేందుకు శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా చోర్ బజార్. మరికొద్ది గంటల్లో ఈ సినిమా తెరపైకి వచ్చేందుకు రెడీ అవుతుండగా...రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు.
ఈ రిలీజ్ ట్రైలర్ చూస్తే..వజ్రాన్ని దొంగలు కొట్టేయడం, అది చోర్ బజార్ కు చేరడం, పోలీసులు చేసిన హంగామా, బచ్చన్ సాబ్ ఉన్నంతవరకు చోర్ బజార్ ను ఏం చేయలేమని విలన్స్ మాట్లాడుకోవడం, చివరకు చోర్ బజార్ ను మూసేయాలని కొందరి ప్లానింగ్ వర్కవుట్ అవడం..కోర్టు ఆర్డర్స్ తో చోర్ బజార్ ను మూసేసిన ఎమోషనల్ షాట్స్..బచ్చన్ సాబ్ ను పట్టుకోవడం కష్టమే కాదు అసాధ్యమని ఆకాష్ చెప్పిన మాస్ డైలాగ్స్ తో నింపేసిన ఈ ట్రైలర్ సినిమా ఫస్ట్ షో చూసేయాలి అన్నంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. మధ్యలో వచ్చిన మాస్ సాంగ్ బిట్ బీ, సీ సెంటర్లకు సినిమాను క్యాటర్ చేసేలా ఉంది.
ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో గెహనా సిప్పీ నాయికగా నటించింది. డైరెక్టర్ జీవన్ రెడ్డి తెరకెక్కించారు. ఆయన ఫస్ట్ ఇలాంటి మాస్ మూవీ చేశారు.
యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. ఆకాష్ పూరికి కెరీర్ లో ఒక డిఫరెంట్ మూవీగా చోర్ బజార్ నిలుస్తుందని అంచనాలు ఏర్పడుతున్నాయి.
Full View