ప్ర‌పంచ‌యుద్ధాల్ని వ‌దిలిపెట్ట‌ని ఆస్కార్ ల ద‌ర్శ‌కుడు?

Update: 2021-09-12 04:31 GMT
ప్ర‌ఖ్యాత హాలీవుడ్ ద‌ర్శ‌కుడు.. వ‌రుస‌ ఆస్కార్ ల‌తో సంచ‌ల‌నాలు సృష్టించిన  క్రిస్టోఫ‌ర్ నోలాన్ ఇంత‌కుముందు డ‌న్ కిర్క్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. రెండో ప్ర‌పంచ యుద్ధ నేప‌థ్యంలో ఒక ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఆస్కార్ బ‌రిలో డ‌న్ కిర్క్ సంచ‌ల‌నాలు న‌మోదు చేసింది.

ఇప్పుడు మ‌ళ్లీ క్రిస్టోఫర్ నోలాన్ రెండో ప్ర‌పంచ యుద్ధం నేప‌థ్యంలో క‌థాంశాన్ని ఎంచుకుని మ‌రో సినిమాకి స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. త‌దుప‌రి చిత్రాన్ని త్వరలో ప్రకటించబోతున్నట్లు ప్రముఖ హాలీవుడ్ మీడియా సంస్థలు నివేదించాయి. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో  కొన్ని కీల‌క ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రం రూపొంద‌నుంది. J. రాబర్ట్ ఒపెన్ హైమర్ జీవితం ఆధారంగా తెర‌కెక్క‌నుంది. జె.రాబర్ట్ ఒపెన్ హైమర్ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అణు బాంబు అభివృద్ధి కోసం పనిచేసిన భౌతిక శాస్త్రవేత్త. రెండో ప్ర‌పంచ యుద్ధం నేపథ్యంలో 2017 మూవీ డన్ కిర్క్‌ తర్వాత ఇది నోలన్ కు రెండో సినిమా. సిలియన్ మర్ఫీ ఓ కీల‌క పాత్రను పోషించనున్నార‌ని తెలుస్తోంది. సిలియన్ గతంలో బ్యాట్ మన్ బిగిన్స్- ది డార్క్ నైట్ రైజెస్- ఇన్సెప్షన్ - డ‌న్ కిర్క్ చిత్రాల కోసం నోలాన్ తో కలిసి పనిచేశాడు.

నోలాన్ ఈసారి బ్యాన‌ర్ ని మార్చేస్తున్నారు. త‌న స‌న్నిహిత‌ వార్నర్ బ్రదర్స్ తో ఈ ప్రాజెక్ట్ చేయకపోవచ్చని కూడా తెలిసింది. అతను ఇతర ప్రధాన నిర్మాణ సంస్థలకు కథను అందించాడు. వార్నర్ బ్రదర్స్ వారి ఫీచర్ చిత్రాలను ఒకేసారి HBO మాక్స్ థియేటర్లలో విడుదల చేయడం ప్రారంభించిన తర్వాత నోలన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
నోలాన్  తెర‌కెక్కించిన టెనెట్ ఈ క‌రోనా క‌ష్ట‌కాలంలో రిలీజై అద్భుత స‌మీక్ష‌ల్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో జాన్ డేవిడ్ వాషింగ్టన్ - రాబర్ట్ ప్యాటిన్సన్ ప్రధాన పాత్రలు పోషించారు. మునుముందు భారీ కాన్సెప్టుల‌తో అసాధార‌ణ సినిమాల్ని తెర‌కెక్కించేందుకు నోలాన్ భారీ ప్ర‌ణాళిక‌ల్ని క‌లిగి ఉన్నారు.

క్రైసిస్ లోనూ టెనెట్ అసాధార‌ణ వ‌సూళ్లు

మ‌హ‌మ్మారీ భ‌యాల న‌డుమ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజై రికార్డ్ బ్రేకింగ్ వ‌సూళ్ల‌ను సాధించింది టెనెట్. ఆస్కార్ గ్ర‌హీత అయిన‌ ది గ్రేట్ డైరెక్ట‌ర్ క్రిస్టోఫ‌ర్ నోలాన్ తెర‌కెక్కించిన చిత్రంగా గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. కేవ‌లం మ‌హ‌మ్మారీ వ‌ల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద  న‌ష్ట‌పోయినా క‌రోనా క‌ల్లోలంలోనూ ఒక అరుదైన‌ రికార్డును అందుకుంది. వార్నర్ బ్రదర్స్ సంస్థ విడుదల చేసిన టెనెట్ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 365 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ చిత్రం మహమ్మారి మధ్య అమెరికాలోనూ అత్యధిక వసూళ్లు చేసిన హాలీవుడ్ చిత్రంగా స‌రికొత్త రికార్డును నెల‌కొల్పింది.  ఆ త‌ర్వాత దానిని గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ బ్రేక్ చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 390 మిలియన్ డాలర్లను అధిగ‌మించింది.

థియేట‌ర్ల‌లో చూడ‌లేక‌పోతే...!

2020 లో క‌రోనా మ‌హ‌మ్మారీ ప్ర‌కంప‌న‌లు తెలిసిందే. అన్ని రంగాల్లానే సినీప‌రిశ్ర‌మ‌లు అల్ల‌క‌ల్లోలం అయ్యాయి. ముఖ్యంగా థియేట‌ర్ల‌లో సినిమాలు ఆడ‌లేని ప‌రిస్థితితో వినోద‌ రంగం దారుణంగా కుదేలైంది. ఎగ్జిబిష‌న్ రంగం అయితే పూర్తిగా దివాళా తీసే ప‌రిస్థితికి చేరుకుంది.

పెద్ద తెర‌పై పెద్ద ట్రీటివ్వాల్సిన చాలా సినిమాలు ఆన్ లైన్ లో స్ట్రీమింగ్ అయ్యాయి. ప‌లు హాలీవుడ్ క్రేజీ చిత్రాలు థియేట‌ర్ల‌లోకి రాలేక స్ట్రీమింగుతో స‌రిపెట్టుకున్నాయి. నోలాన్ టెనెట్.. కొన్ని థియేట‌ర్ల‌లో మాత్ర‌మే ఆడి ఓటీటీలో స్ట్రీమ్ అయ్యింది. మ్యూజికల్ ఎంటర్ టైనర్ హ్యామిల్టన్ డిస్నీ ప్లస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వేదిక‌పై టెనెట్ ని వీక్షించే వెసులుబాటు ఉంది.
Tags:    

Similar News