వరల్డ్‌ ఫేమస్‌ 'సినీ వరల్డ్‌' మూసివేత

Update: 2020-10-06 16:00 GMT
కరోనా కారణంగా పలు దేశాల్లో థియేటర్లు మూసి వేశారు. కొన్ని దేశాల్లో మాత్రం పాక్షికంగా థియేటర్లు రన్‌ అవుతున్నాయి. ఆమద్య ఒక నెల పాటు అమెరికా మరియు బ్రిటన్‌ లలో కూడా థియేటర్లు పాక్షికంగా మూసి వేసినా ప్రస్తుతం పూర్తి స్థాయిలో నడుపుతున్నారు. అయితే ప్రేక్షకులు కరోనాకు భయపడి లేదంటే ఆర్థిక పరిస్థితులు సరిగా లేక పోవడం వల్ల థియేటర్లకు రావడం లేదు. ఆ కారణంగా చాలా థియేటర్లను నష్టాల్లోనే రన్‌ చేస్తున్నారు. పెద్ద సినిమాలు విడుదల కాకపోవడంతో పాత సినిమాలతో నెట్టుకు వస్తున్నారు. అమెజాన్‌.. నెట్‌ ఫ్లిక్స్‌.. డిస్నీ వంటి ఓటీటీ లు ఉండటంతో థియేటర్లకు వెళ్లే అవకాశం రావడంలేదు. ఇలాంటి సమయంలో ఆర్థిక భారంను మోయలేక బ్రిటన్‌ లోనే ప్రముఖ మైన మల్టీప్లెక్స్‌ చైన్‌ సినీ వరల్డ్‌ ను మూసి వేసింది. 127 థియేటర్లు ఉన్న సినీ వరల్డ్‌ గత ఆరు నెలలుగా ఆర్థిక నష్టాల్లో కొనసాగుతుంది.

ఇప్పటికే సినీ వరల్డ్‌ చైన్‌ థియేటర్స్‌ 350 కోట్ల పౌండ్ల నష్టాల్లో ఉంది. జేమ్స్‌ బాండ్‌ మరియు స్టార్‌ వార్స్‌ తో పాటు మరికొన్ని భారీ సినిమాలు విడుదలపై ఆశ పెట్టుకున్న వీరు ఆ సినిమాలు మళ్లీ వాయిదా పడటంతో ఇక కొంత కాలం పాటు తమ కార్యకళాపాలను నిలిపేయాలనే నిర్ణయానికి వచ్చారు. దాంతో దాదాపుగా 4500 మంది ఆ సంస్థ ఉద్యోగులు రోడ్డున పడబోతున్నారు. వారికి ఈ కాలానికి జీతాలు కూడా ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ఎప్పటి వరకు ఈ మూసివేత అనే విషయంలో ఇప్పుడే ఏం చెప్పలేమని వారు అన్నారు. వరల్డ్‌ ఫేమస్‌ మల్టీప్లెక్స్‌ చైన్‌ అయిన సినీ వరల్డ్‌ కు ఇలాంటి పరిస్థితి రావడం బ్రిటన్‌ లో చర్చనీయాంశంగా మారింది. కరోనా పరిస్థితులకు ఇది అద్దం పడుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
Tags:    

Similar News