బంద్ సరే.. మళ్లీ నష్టం లెక్కలెందుకు?

Update: 2018-03-05 16:50 GMT
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ జరగనంతగా స్ట్రాంగ్ గా ఓ బంద్ జరుగుతోంది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు.. నిర్మాతలు- ఎగ్జిబిటర్లు దాదాపుగా యుద్ధం చేస్తున్నారు. నాలుగు రోజులుగా సినిమా ప్రదర్శనలను పూర్తిగా నిలిపివేసి మరీ తమ అసహనాన్ని వెల్లడిస్తున్నారు.

డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు, నిర్మాతల మధ్య చర్చలు ఇవాళ కూడా విఫలం అయ్యాయి. నాలుగో రోజు కూడా థియేటర్ల బంద్ కొనసాగింది. ఐదో రోజు విషయంలో కూడా ఇంకా ఏమీ తేలలేదు. పైగా శుక్రవారం వరకు బంద్ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు ఎగ్జిబిటర్లు. వీపీఎఫ్ ఛార్జీలను 16 శాతం తగ్గిస్తామంటూ డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు కొంతమేర దిగి వచ్చారు. అయితే.. క్రమంగా దీన్ని పూర్తిగా తొలగించాలన్నది అవతలి పార్టీ డిమాండ్. అందుకే ఈ హామీపై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ బంద్ ఇలాగే కొనసాగుతుండడంతో.. రోజుకు దాదాపు 3 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు.

బంద్ చేస్తుండడం వరకూ ఓకే అయినా.. అసలు ఒక్క షో కూడా పడకుండా.. ఇలా తమకు ఎంత నష్టం వస్తోందని చెబుతుండడం కొన్ని విమర్శలకు కారణం అవుతోంది. సినిమా షోలు పడకపోతే నష్టం వస్తుందని తెలిసిన తర్వాతే.. బంద్ చేయడం ప్రారంభించారు కదా. మళ్లీ ఇప్పుడు రోజుకు అంత నష్టం.. ఇంత నష్టం అని చెబుతుండడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. దీర్ఘకాల ప్రయోజనాల కోసం పోరాటాలు చేసేటపుడు ముందు కొంత నష్టం ఫేస్ చేయక తప్పదు కదా ఎగ్జిబిటర్లూ.
Tags:    

Similar News