రజని మాట తప్పుతున్నారుగా

Update: 2019-02-28 11:49 GMT
గత ఏడాది కాలంగా సినిమాలు చేయడంలో విపరీతమైన దూకుడు పెంచిన సూపర్ స్టార్ రజనికాంత్ మురుగదాస్ మూవీ కోసం రెడీ అవుతున్నారు. పేట తెలుగులో డిజాస్టర్ అయ్యింది కాని తమిళ్ లో వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి చాలా కాలం తర్వాత నిజమైన అర్ధశతదినోత్సవ చిత్రాన్ని అభిమానులకు కానుకగా ఇచ్చింది. ఇక మురుగదాస్ సినిమాలో ఇద్దరు హీరొయిన్లు ఉంటారనే ప్రకటన వచ్చేసింది. ఒకరు నయనతార. రెండు కీర్తి సురేష్.

నయన్ తో ఎలాంటి చిక్కు లేదు. తన కెరీర్ మొదటి బ్రేక్ అందుకున్నది రజని సినిమా చంద్రముఖితోనే. ఆ తర్వాత కూడా ఇద్దరు కలిసి కథానాయకుడులో మెరిశారు. సో వయసు గ్యాప్ ఎక్కువగా కనిపించదు ప్లస్ ఆల్రెడీ ఆమోదించిన జంట కాబట్టి ఎలాంటి ఇబ్బందీ ఉండదు

కాని కీర్తి సురేష్ ఇప్పుడిప్పుడే పైకొస్తున్న అప్ కమింగ్ యంగ్ హీరొయిన్. ఆ మధ్య కాలా ఫంక్షన్ లో తన కూతుళ్ళ వయసు ఉన్న అమ్మాయిలతో డాన్స్ రొమాన్స్ చేయనని చెప్పిన రజిని ఇప్పుడు ఏ లెక్కన కీర్తి సురేష్ ని ఒప్పుకున్నాడో అని చెన్నై మీడియాలో అప్పుడే చెవులు కొరుక్కుంటున్నారు. నిజమే మరి. కీర్తి సురేష్ రజని ఇద్దరు కూతుళ్ళ కంటే చాలా చిన్న వయసుది.

ఇటు చూస్తే ఇద్దరు హీరొయిన్లు అన్నారు కాబట్టి జోడిగానే ఉంటుంది తప్ప కీర్తి సైడ్ ఆర్టిస్టుగానో సపోర్టింగ్ రోల్ లోనో కనిపించదు కదా. అంటే తలైవా మాట మార్చినట్టే. సర్కార్ చేస్తున్నప్పుడు కీర్తి సురేష్ పనితనం మెచ్చిన దాస్ స్పెషల్ గా తనను తీసుకున్నాడు. తీరా చూస్తే ఇప్పుడీ కామెంట్స్. చూద్దాం రజని దీనికి ఏమంటారో


Tags:    

Similar News