మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 15వ చిత్రం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు షూటింగ్ పూర్తిచేసారు. హైదరాబాద్..రాజమండ్రిలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. చరణ్ ..కియారాతోపాటు కీలక సభ్యులంతా ఈ షూట్ లో పాల్గొన్నారు. ఇందులో చరణ్ రెండు డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది.
శంకర్ మార్క్ సందేశాన్నిచ్చేసినిమా అవుతుందని భారీ అంచనాలున్నాయి. చరణ్ ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా శంకర్ `ఒకే ఒక్కడు` రేంజ్ లో చరణ్ ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇలాంటి సినిమా మెగాస్టార్ చిరంజీవితో శంకర్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అది వీలుపడలేదు.
ఈ విషయాన్ని రోబో ప్రమోషన్ సమయంలో చిరంజీవి తెలిపారు. రజనీకాంత్ తో సినిమా చేస్తున్నారు? నాతో ఎప్పుడు చేస్తారు? ఆ అదృష్టం మాకు ఉందా? అని చిరంజీవి-శంకర్ ముందు అన్నారు. ఆ మాటకి శంకర్ ఇద్దరికి కుదిరనప్పుడు తప్పకుండా చేద్దామన్నారు. కానీ సాధ్య కాలేదు. దీంతో ఇప్పుడు తండ్రికి ఇచ్చిన ఆ మాటను చరణ్ రూపంలో శంకర్ నెర వేర్చుకుంటున్నారు.
అంటే ఈ చిత్రాన్ని శంకర్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారో అంచానా వేయోచ్చు. చరణ్..చిరంజీవిపై ఉన్న ఇష్టాన్ని శంకర్ ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేయనున్నారు. ఇక షూటింగ్ చకచకా జరుగుతోన్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమా రిలీజ్ అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు. కానీ అది సాధ్యమయ్యే పరిస్థితి లేదన్నది కొందరి వాదన.
షూటింగ్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు శంకర్ చాలా సమయం తీసుకుంటారని వినిపిస్తుంది. తను అనుకున్న విధంగా సినిమా రావాలంటే ఆన్ సెట్స్ లో తీయడం ఒక ఎత్తైతే ల్యాబ్ కి వెళ్లిన తర్వాత దాన్ని అందంగా మలచడంలో శంకర్ చాలా సమయం వెచ్చిస్తారు. ఇది ఆయనకు కొత్తేం కాదు. శంకర్ ప్రతీ సినిమా విషయంలో జరిగేదే.
ఇప్పుడు ఆర్ సీ 15 లోనూ అదే రిపీట్ అవుతుందని అంటున్నారు. అదే గనుక జరిగితే సినిమా 2023 సంక్రాతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు. సమ్మర్ హాలీడేస్ టార్గెట్ గా చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుందని ప్రచారం సాగుతోంది. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే మరో మూడు ..నాలుగు నెలలు సమయం పడుతుందని సమాచారం.
ఈ సినిమా బడ్జెట్ కూడా పెరుగుతుందని క్లోజ్ సోర్సెస్ ద్వారా తెలిసింది. ముందు వేసుకున్న లెక్కలు మొత్తం ఆన్ సెట్స్ కి వెళ్లే సరికి తారుమారు అవుతున్నాయని గుస గుస వినిపిస్తుంది. అయినా దిల్ రాజు ఏమాత్రం తగ్గరు. ఇండియన్-2 చిత్రాన్నే నిర్మించడానికి రె డీ అయ్యారు. అంతటి రాజుగారికి చరణ్ కి బడ్జెట్ కేటాయించడం పెద్ద విషయమా.