ఒక్క‌ట‌వుతున్న‌ బిగ్ మ‌ల్టీప్లెక్స్ చైన్..ఎవ‌రికి లాభం?

Update: 2023-01-13 12:30 GMT
మ‌ల్టీప్లెక్స్ రంగంలో భారీ మార్పులు జ‌ర‌గ‌బోతున్నాయా? అంటే మ‌ల్టీప్లెక్స్ రంగ నిపుణులు అవున‌నే స‌మాధానం చెబుతున్నారు. దేశంలో ప్ర‌ధాన మ‌ల్టీప్లెక్స్ చైన్ ల‌ని క‌లిగి వున్న సంస్థ‌లు పీవీఆర్‌, ఐనాక్స్‌. ఈ రెండు దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో మ‌ల్టీప్లెక్స్ ల‌ని క‌లిగి వున్న విష‌యం తెలిసిందే. ఇవే త్వ‌ర‌లో ఒక్క‌టి కానున్నాయ‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే దేశంలోనే అతి పెద్ద మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల చైన్ గా ఈ రెండు సంస్థ‌లు నిల‌వ‌బోతున్నాయి.

త్వ‌ర‌లోనే పీవీఆర్‌, ఐనాక్స్ సంస్థ‌ల విలీనానికి శ్రీ‌కారం చుట్ట‌బోతున్న‌ట్టుగా తెలుస్తోంది. దీనికి నేష‌న‌ల్ కంప‌నీ లా ట్రిబ్యున‌ల్ ముంబై బెంచ్ ఇప్ప‌టికే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రో రెండు వారాల్లో వ్రాత పూర్వ‌కంగా ఉత్త‌ర్వులు వెలువ‌డే అవ‌కాశం వుంద‌ని చెబుతున్నారు. ఈ రెండు మ‌ల్టీప్లెక్స్ చైన్ ల మ‌ధ్య షేర్ ప్రాతిపాదిక ఒప్పందం కూడా కుద‌రింద‌ని కూడా తెలుస్తోంది. సీవీఆర్ కు మూడు శాతం, ఐనాక్స్ కు ప‌ది శాతం షేర్ ని కేటాయించ‌నున్నార‌ట‌.  

గ‌త సంవ‌త్స‌రం పీవీఆర్ మ‌రిము ఐనాక్స్ మ‌ల్టీప్లెక్స్ చైన్ భార‌త‌దేశంలో ఇండియా వ్యాప్తంగా 1500 స్క్రీన్ ల‌ని నెట్ వ‌ర్క్ ని విస్త‌రించి అతి పెద్ద మ‌ల్టీప్లెక్స్ నెట్ వ‌ర్క్ గా అవ‌త‌రించాల‌ని ప్లాన్ చేసుకున్నాయి. పీవీఆర్ చైర్మ‌న్ అజ‌య్ బిజీ ఐదేళ్ల‌లో 300ఏ లేదా 4000 స్క్రీన్ ల‌కు ఈ మ‌ల్టీప్లెక్స్ చైన్ నెట్ వ‌ర్క్ ని పెంచాల‌ని ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళుతున్నారు.

విలీనం త‌రువాత మ‌ల్టీప్లెక్స్ నెట్ వ‌ర్క్ పేరుని పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ గా మారుస్తున్నార‌ట‌. మెర్జ్ అయిన త‌రువాత ఈ రెండూ క‌లిపి దేశంలోనే లార్జెస్ట్ మ‌ల్టీప్లెక్స్ నెట్ వ‌ర్క్ గా అవ‌త‌రించ‌నుంద‌ని, దేశం మొత్తంలో 50 శాతం వాటాని ఆక్ర‌మించుకోవ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా బాక్సాఫీస్ రెవెన్యూలో హిందీ, ఇంగ్లీష్ కంటెంట్ ప‌రంగా 42 శాతం వాటాని ద‌క్కించుకోనుంద‌ని కూడా ట్రేడ్ విశ్లేష‌కులు చెబుతున్నారు.

అంతే కాకుండా రెండు భారీ మ‌ల్టీప్లెక్స్ చైన్ ఒక్క‌ట‌వుతుండ‌టంతో థియేట‌ర్ల అద్దెల విష‌యంలోనూ ఎక్కువ‌గా డిమాండ్ చేసే వీలుంటుంద‌ని కామెంట్ లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా రెండు భారీ సంస్థ‌ల విలీనం దేశంలోనే వినోద రంగంలో భారీ మార్పుల‌కు శ్రీ‌కారం చుడుతుంద‌ని, స్క్రీనింగ్ రంగంలో టాప్ లో నిల‌వ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.
    

Tags:    

Similar News