పావలా శ్యామల.. ఈ సీనియర్ నటి చేసినవన్నీ చిన్నా చితకా పాత్రలే అయినా అవి ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయేవే. రంగస్థలం నుంచి వచ్చి సినిమాల్లో చిన్న చిన్న వేషాలతోనే ఒక దశలో బిజీగా ఉండేది శ్యామల. కానీ తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. మరోవైపు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో లైమ్ లైట్లో లేకుండా పోయాయి. ఆమె ఇబ్బందుల గురించి తెలిసి చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేసినట్లు ఇంతకుముందు వార్తలు వచ్చాయి.
అయినా తన కష్టాలు తీరలేదని.. ఇప్పటికీ ఇబ్బందులు కొనసాగుతున్నాయని పావలా శ్యామల ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. తనకు టాలీవుడ్లోని పలువురు స్టార్ హీరోలు ఆర్థిక సాయం చేసినట్లుగా వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. చిరు, పవన్ మాత్రమే తనకు సాయం చేశారని వెల్లడించింది. అలాగే తనకు ఇండస్ట్రీలో పెద్ద అవమానం జరిగిందని, దాని గురించి చిరంజీవికి చెప్పాలనుకుంటున్నానని ఆమె తెలిపారు.
‘‘కరోనా సమయంలో నేను ఆర్తికంగా ఇబ్బందులు పడుతున్నానని తెలుసుుకని 2 లక్షల రూపాయలు పంపించి ఆదుకున్నారు. నటీనటులకు ఎలాంటి అన్యాయం జరిగినా ఆయన ముందుండి మాట్లాడతారు. కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ఆయన వ్యక్తిత్వం అలా ఉంటుంది. ఆయన్ని ఒకసారి కలవాలని ఉంది. నాకు జరిగిన అవమానం గురించి ఆయనకు చెప్పాలని ఉంది. దాని గురించి ఆయనకు తెలిస్తే అస్సలు సహించరు’’ అని శ్యామల తెలిపింది.
ఐతే తనకు జరిగిన అవమానం ఏంటన్నది వెల్లడించడానికి శ్యామల ఇష్టపడలేదు. గతంలో తనకు మందులు కొనడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే.. ఏదైనా చిన్న వేషం ఇప్పించి ఆదుకోవాలని పవన్ కళ్యాణ్‌ను కలిసి విన్నవించగా, ఆయన వెంటనే లక్ష రూపాయలు సాయం చేశారని శ్యామల తెలిపింది. ప్రస్తుతం శ్యామలకు ఎలాంటి ఆర్థిక ఆధారం లేకపోవడంతో తన కుమార్తెతో కలిసి హైదరాబాద్‌లోని ఒక వృద్ధాశ్రమంలో ఉంటోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.