వైరల్ వీడియో : యంగ్ హీరోలతో డాకు సెలబ్రేషన్
ముఖ్యంగా యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ లు ఈ పార్టీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజ్ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సినిమా పట్ల పాజిటివ్‌గా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రివ్యూల ద్వారా మిశ్రమ స్పందన వచ్చినా ఓవరాల్‌గా సినిమాకి హిట్ టాక్ వచ్చిందని చిత్ర యూనిట్ సభ్యులు సక్సెస్ మీట్‌లో పేర్కొన్నారు. డాకు మహారాజ్ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. బాలకృష్ణ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు, ఇంకా పలువురు ఈ పార్టీకి హాజరయ్యారు. ముఖ్యంగా యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ లు ఈ పార్టీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
పార్టీలో బాలకృష్ణ ఆ ఇద్దరు హీరోలతో సరదాగా గడిపిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ కి బాలకృష్ణ ముద్దు పెట్టి మరి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. బ్యాక్ టు బ్యాక్ నాలుగు విజయాలు సొంతం చేసుకున్న బాలకృష్ణకు శుభాకాంక్షలు అంటూ సిద్దు, విశ్వక్సేన్ తమ విషెష్ తెలియజేశారు. డాకు మహారాజ్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. మీడియా ముందుకు వచ్చి ఈ సినిమాకు సీక్వెల్ లేదా ఫ్రీక్వెల్ ఉంటుందని నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రకటించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి రోజు మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టింది.
లాంగ్ రన్ లోను ఈ సినిమా భారీగా వసూళ్లు సొంతం చేసుకుంటుందని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా సక్సెస్ నేపథ్యంలో అనంతపురంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో నిర్వహించాలని భావించారు. కానీ తిరుపతి ఘటన కారణంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు సక్సెస్ మీట్ అక్కడ చేయడం ద్వారా ఫ్యాన్స్ కి దగ్గర కావాలని బాలకృష్ణ అండ్ టీం భావిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా ముఖ్య పాత్రల్లో ఊర్వసి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్ నటించారు.
ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాల స్థాయిని పెంచింది. ప్రతి సన్నివేశంలోనూ బాలకృష్ణను ఎలివేట్ చేసినట్లుగా ఉంది. ఆకట్టుకునే స్థాయిలో సినిమా యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. బాలకృష్ణ డాకు గెటప్‌లో అద్భుతంగా నటించారు అంటూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వాల్తేరు వీరయ్య వంటి కమర్షియల్ హిట్ తర్వాత మరోసారి దర్శకుడు బాబీ ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్‌ని అందుకున్నట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 సినిమాలో నటిస్తున్నాడు. అందరి దృష్టి ఆ సినిమాపై ఉంది.