డాకు మహారాజ్ బాక్సాఫీస్: మొదటి రొజే సెన్సేషన్..

డాకు మహారాజ్ సినిమా మాస్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటూ మంచి వసూళ్లు రాబట్టింది. బాలయ్య క్రేజ్‌తో పాటు బాబీ దర్శకత్వంలో రూపొందిన కథ, స్క్రీన్ ప్లే సినిమాను మరింత బలంగా నిలబెట్టాయి.

Update: 2025-01-13 06:32 GMT

నందమూరి బాలకృష్ణ మాస్ స్టామినా మరోసారి బాక్సాఫీస్‌ వద్ద హోరెత్తించింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన డాకు మహారాజ్ సినిమా మంచి హైప్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పై నాగవంశీ నిర్మించారు. సినిమాకు సంబంధించిన ట్రైలర్స్ మంచి బజ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా బాలయ్య మాస్ యాక్షన్ డోస్ క్లిక్కయినట్లు అర్ధమవుతుంది.

ఇక బాక్సాఫీస్ వద్ద డాకు మహరాజ్ సినిమా మొదటి రోజు నుంచే భారీ కలెక్షన్లను రాబట్టింది. థమన్ అందించిన నేపథ్య సంగీతం, బాలయ్య పవర్‌పుల్ ఫెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ సందడి మొదటి షో నుంచే కనిపించింది. టికెట్ కౌంటర్ల వద్ద అభిమానుల తాకిడి అధికంగా ఉండటంతో, తొలి రోజు కలెక్షన్లు అంచనాలకు మించిన స్థాయిలో వచ్చాయి.

డాకు మహారాజ్ సినిమా మాస్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటూ మంచి వసూళ్లు రాబట్టింది. బాలయ్య క్రేజ్‌తో పాటు బాబీ దర్శకత్వంలో రూపొందిన కథ, స్క్రీన్ ప్లే సినిమాను మరింత బలంగా నిలబెట్టాయి. సంక్రాంతి సీజన్‌ను పురస్కరించుకుని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు రాగా, మౌత్ టాక్ కూడా సినిమాకు అనుకూలంగా మారింది. ముఖ్యంగా బాలయ్య యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులకు కిక్కిచ్చినట్లు అర్ధమవుతుంది.

సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా అత్యంత భారీగా జరిగింది. ప్రస్తుతంగా వస్తున్న వసూళ్లతో బ్రేక్ ఈవెన్ మార్క్‌కి చేరడం పెద్ద సవాలుగా అనిపించడంలేదు. ఇకపై కూడా వీకెండ్ వసూళ్లు అదే స్థాయిలో కొనసాగితే సినిమా సూపర్ హిట్‌గా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో బాలయ్య సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడిన సంగతి తెలిసిందే. డాకు మహారాజ్ కూడా అదే విధంగా బాక్సాఫీస్ రన్‌లో దూసుకుపోతోంది. నైజాంలో సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టిన విషయం గమనార్హం. ఇక్కడి నుంచే సినిమా తొలి రోజున మంచి షేర్‌ను సాధించింది.

డాకు మహారాజ్ తొలి రోజు ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ కలెక్షన్లు (షేర్):

1. నైజాం: ₹4.07 కోట్లు

2. ఉత్తరాంధ్ర: ₹1.92 కోట్లు

3. గుంటూరు: ₹4.00 కోట్లు

4. కృష్ణా: ₹1.75 కోట్లు

5. తూర్పు గోదావరి: ₹1.95 కోట్లు

6. పశ్చిమ గోదావరి: ₹1.75 కోట్లు

7. నెల్లూరు: ₹1.51 కోట్లు

Tags:    

Similar News