అనంతపురం ఊగిపోయేలా మహరాజ్!
అంతకు మించిన రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేయడానికి నందమూరి అభిమానులంతా సిద్దమవ్వాల్సిన సమయం మరోసారి వచ్చేసింది.
నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురం లో భారీ ఎత్తున ఏర్పాటు చేసినా తిరుపతి ఘటనతో రద్దైయినా సంగతి తెలిసిందే. దీంతో బాలయ్య అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రచ్చ రంబోలా చేద్దామనుకుంటే ఇలా జరిగిందేంటని ఊసురు మన్నారు. అయినా ఇప్పుడేం పర్వాలేదు. అంతకు మించిన రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేయడానికి నందమూరి అభిమానులంతా సిద్దమవ్వాల్సిన సమయం మరోసారి వచ్చేసింది.
భారీ ఎత్తున విజయోత్సవ వేడుకను అనంతర పురంలో నిర్వహిస్తున్నట్లు నిర్మాత నాగవంశీ ప్రకటించారు. ఆ వేడుక ఇదే వారంలో ఉంటుందని తెలిపారు. ఇది బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్. ప్రీరిలీజ్ ఈవెంట్ సమయానికి సినిమా ఎలా ఉంటుంది? హిట్ అవుతుందా? లేదా? అనే రకరకాల టెన్షన్ వాతావరణంతో వేడుకను ఆస్వాదిం చాల్సి ఉంటుంది. కానీ విజయోత్సవ వేడుక అంటే? మంచి ఉత్సాహంతో జరుపునే పండుగ.
'డాకు మహారాజ్' కు ఎలాగూ హిట్ టాక్ వచ్చేసింది. 'గేమ్ ఛేంజర్' పై ప్లాప్ టాక్ నేపథ్యంలో మహారాజ్ కుమ్మేస్తు న్నాడు. బాలయ్య ఖాతాలో మరో మాస్ హిట్ పడిపోయింది. దీంతో అభిమానులంతా పుల్ ఖుషీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ అనంతపురం సక్సెస్ వేడుకలో భారీ ఎత్తున పాల్గోనే అవకాశం ఉంటుంది. అనంతపురం అంటే బాలయ్య అడ్డా. ఆ ప్రాంతం నుంచి బాలయ్య అంటే విపరీతమైన అభిమానులెంతో మంది ఉన్నారు.
సీమ పౌరుషం గురించి తొలిసారి పరిచయం చేసింది సినిమాలే. అలా బాలయ్య అక్కడ ఎంతో ఫేమస్ అయ్యారు. హిందుపురం ఎమ్మెల్యేగాను హ్యాట్రిక్ సాధించారు. సినిమా -రాజకీయం రెండు రకాలుగానూ బాలయ్యకు అక్కడ మంచి క్రేజ్ ఉంది. అందుకే అనంతపురం అంటే బాలయ్యకు ప్రత్యేకమైన అభిమానం చూపిస్తుంటారు.