క్యారెక్టర్ ఏదైనా అద్భుతంగా పండించే కమెడీయన్ రఘు. తన సినీ ప్రయాణంపై ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ ను తనెంతగా ఆరాదిస్తానో రఘు ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు. తన సినీ ప్రయాణం అనుకోకుండా మొదలైనా.. ఆ ప్రయాణం ఎన్టీఆర్ ‘ఆది’ సినిమాతోనే ప్రారంభమవడం ఎంతో సంతోషాన్నిస్తుందని రఘు వివరించారు. ఆది సినిమా నుంచి మొదలుకొని ఇప్పటిదాకా తనకు ఎన్టీఆర్ తో ఎనలేని అనుబంధం ఉందన్నాడు. అంతేకాదు ఎన్టీఆర్ అంటే తనకు మాత్రమే వీరాభిమానం కాదని, తన భార్య, పిల్లలకు కూడా తారక్ అంటే చాలా అభిమానమని తెలిపారు.
ఈ సందర్భంగా తను, తన కుటుంబం ఎన్టీఆర్ ను పెద్ద దిక్కుగా చూస్తామని రఘు వివరించారు. తారక్ అంటే తనకు ఎనలేని అభిమానమని - ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలే తనకు - తన కుటుంబానికి అత్యంత విలువైనవని తన మదిలోని ప్రేమను చాటుకున్నాడు. ఎన్టీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులతోనూ మంచి సంబంధాలు ఉన్నాయని రఘు చెప్పారు. కల్యాణ్ రామ్ తోనూ తనకు మంచి స్నేహం ఉందని, ఎన్టీఆర్ తో పంచుకోలేని అనేక విషయాలను కళ్యాణ్ రామ్ తో చెప్పుకుంటానని రఘు వివరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/