బన్నీకీ .. వరుణ్ కి మధ్య ఉన్న కామన్ క్వాలిటీ అదే!

Update: 2022-04-03 03:49 GMT
కొంతకాలంగా కథల విషయంలో వరుణ్ తేజ్ మరింత దృష్టి పెట్టాడు. 'ఎఫ్ 2' సినిమాతోను .. గద్దలకొండ గణేశ్ సినిమాతోను భారీ విజయాలను అందుకున్నాడు. ఇక ఇప్పుడు 'గని' సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. తమన్ అందించిన బాణీలు .. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చిన ఈ సినిమాను ఈ నెల 8వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో నిర్వహించారు.

గతంలో వరుణ్ తేజ్ తో 'గద్దలకొండ గణేష్' సినిమాను రూపొందించి హిట్ కొట్టిన హరీశ్ శంకర్ మాట్లాడుతూ .. " వైజాగ్ బన్నీ అడ్డా .. 'సరైనోడు' .. 'అల వైకుంఠపురములో' ఫంక్షన్స్ ఇక్కడే జరిగాయి. రాజమౌళి తరువాత తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయికి తీసుకెళ్లి 'తగ్గేదే లే' అని నిరూపించాడు.

అలాంటి బన్నీతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను .. ఆయన  పరిచయాన్ని గర్వంగా ఫీలవుతున్నాను. ఈ సినిమా నిర్మాతలైన  అల్లు బాబీ .. సిద్ధు గురించి చెప్పాలి. అల్లు బాబీ ఏ విషయమైనా ముఖం మీద చెప్పేస్తాడు. బోల్డ్ గా .. ఫ్రాంక్ గా మాట్లాడతాడు.

మొహమాటానికి  పొగిడేవాళ్ల కంటే .. మొహం మీద తిట్టేవాళ్లని వెల్ విషర్స్ గా ఆయన భావిస్తూ ఉంటాడు. ఈ సినిమాతో ఆయన పూర్తిస్థాయి నిర్మాతగా మారడం ఆనందంగా ఉంది. అందుకు ఆయనకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ఇక సిద్ధు విషయానికి వస్తే తను కూడా నాకు చాలా కాలంగా తెలుసు .. నాకు మంచి ఫ్రెండ్.  

తనకి మంచి టేస్టు ఉంది .. చాలా హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్. కిరణ్ కొర్రపాటి విషయానికి వస్తే 'మిరప కాయ్' సినిమాకి నా దగ్గర కో డైరెక్టర్ గా చేశాడు. నా దగ్గర నుంచి ఆయన ఏం నేర్చుకున్నాడనేది తెలియదుగానీ, ఎంత టెన్షన్ ఉన్నప్పటికీ కామ్ గా పనిచేసుకుని వెళ్లిపోవడం నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను.

అలాంటి కిరణ్ ఈ సినిమాతో దర్శకుడు అయినందుకు హ్యాపీగా ఉంది .. పాటలు విన్నాను .. తమన్ ఇరగదీశాడు. ఇక వీళ్లందరినీ ముందుకు నడిపించేది అల్లు అరవింద్ గారు. ఇందాక నేను కలిసినప్పుడు .. ఒక లవ్ స్టోరీ చేద్దామని అన్నారు. దానిని బట్టి ఆయన ఏ ఏజ్ వాళ్లతో పోటీపడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు.

ఆయన విజన్ కీ .. స్పాన్ కి ఒక లిమిట్ లేదు. వయసును ఆయన ఎక్కడ దాస్తున్నారనేది తెలియడం లేదు. బన్నీతోను .. వరుణ్ తోను కలిసి పనిచేశాను కనుక, వాళ్లలో కామన్ గా ఉన్న ఒక క్వాలిటీ గురించి నాకు తెలుసు. సెట్లో సీన్ పేపర్ తప్ప వాళ్లు ఏమీ పట్టించుకోరు.

ఆ సమయంలో ఫోన్ కూడా వాళ్లు దగ్గర పెట్టుకోరు. డైలాగ్ ఏంటి? నెక్స్ట్ షాట్ ఏంటి? అనే విషయం తప్ప మరో ధ్యాస ఉండదు. ఈ సినిమాకి వరుణ్ ఎంత కష్టపడ్డాడనేది నాకు తెలుసు. ఈ 'గని' .. ఒక డబ్బుల గని కావాలని కోరుకుంటున్నాను" అంటూ ముగించాడు.
Tags:    

Similar News