నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జాతిరత్నాలు’. ఈ సినిమాలో స్వతంత్ర సమరయోధులను అవమానించారని, అందువల్ల సినిమాను నిషేధించాలని శివసేన నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా గంగాధర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫ్రీడమ్ ఫైటర్ రాంప్రసాద్ బిస్మిల్ ను ఉరితీసే సమయంలో ఆయన చదివిన ‘‘సర్ ఫరోషికీ తమన్నా హబ్ హమారే దిల్ మీ హై’’ కవితను అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమాలో ఈ కవితను ‘‘సర్ ఫరోషికీ తమన్నా, సమంతా,రష్మిక, తీనోసాథ్ హాయ్..’’ అంటూ వెటకారంగా పాడారని అన్నారు.
ఇలా చేయడం ద్వారా.. రాంప్రసాద్ బిస్మిల్ ను కించపరచడమే కాకుండా.. నేటి తరానికి తప్పుడు సందేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. ఈ చర్యకు పాల్పడిన సినీ రచయిత, నిర్మాత, సంగీత దర్శకుడు, కవిత ఆలపించిన గాయకుడిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.