తెలుగులోలానే ఇంగ్లీష్ లో కూడా ఇంట్రెస్టింగ్ కొటేషన్లు ఉంటాయి. అలాంటిదే ఒకటి పాబ్లో పికాసో అని పెద్దాయన చెప్పిన 'గుడ్ ఆర్టిస్ట్స్ కాపీ; గ్రేట్ ఆర్టిస్ట్స్ స్టీల్'.. తెలుగులోకి అనువాదం చేస్తే 'మంచి కళాకారులు కాపీ కొడతారు.. అదే గొప్ప కళాకారులు దొంగతనం చేస్తారు.' అంటే 'కంపు కామన్' లా కాపీ కామన్ అన్నమాట. ఇప్పుడు అదే సమస్య మన దేవరకొండ కొత్త సినిమా 'గీత గోవిందం' కు వచ్చి పడింది.
అంటే వాళ్ళు కాపీ కొట్టారో లేదో ఇంకా ప్రూవ్ కాలేదు కానీ నివాస్ అనే ఒక తెలుగు రచయిత రైటర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేస్తే.. అసోసియేషన్ లోని పెద్దలు విచారణ జరుపుతున్నారట. నివాస్ చాలా రోజుల నుండి డైరెక్షన్ డిపార్టుమెంటులో పనిచేస్తున్నాడట. అతడు అప్పుడెప్పుడో 'వర్జిన్' అనే పేరుతో ఒక కథ రాసి ఆ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు చేశాడట. ఆ 'వర్జిన్' కి హీరో గా కమెడియన్ జోగి నాయుడుని అనుకున్నాడట. కానీ ఎందుకో ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదట. ఇప్పుడు 'గీత గోవిందం' లో విజయ్ దేవరకొండ నేను వర్జిన్.. నేను వర్జిన్ అంటూ ఉండే సరికి ఆ నివాస్ ఈ సినిమాపై కంప్లైంట్ చేయడం జరిగిందట.
మరి ఈ 'వర్జిన్' టెస్టును విజయ్ దేవరకొండ అయన టీమ్ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి. పొద్దున్నే ఈ వర్జినిటీ గోల మనకెందుకండీ అనుకోవద్దు. అప్పుడప్పుడు ఇలాంటి టెస్టులే అసలు సినిమాలో నిజంగా విషయం ఉందా.. ఒరిజినల్ స్టఫ్ఫేనా కాదా అనే సంగతి అందరికీ తెలిసేలా చేస్తాయి. చూద్దాం ఏం జరుగుతుందో! మరోవైపు 'గీత గోవిందం' సినిమా ఆగష్టు 15 న రిలీజ్ కానుంది.