పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఇప్పటి దాకా చేసినవి హాట్ హాట్ అందాలు చూపించే సినిమాలు కాబట్టి ఏ వర్గం నుంచి పెద్దగా అభ్యంతరం వ్యక్తం కాలేదు. కాని ఇప్పుడు మాత్రం తనకు నిరసనల సెగ మొదలైపోయింది. కారణం ఇటీవలే మొదలైన వీరమాదేవి సినిమా. బహుబాషా చిత్రంగా సన్నీ లియోన్ ఒక వీరనారి పాత్రలో నటిస్తున్న ఈ మూవీ భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. అందులో భాగంగా చెన్నైలో జరగనున్న ఒక ఈవెంట్ కు సన్నీ లియోన్ అతిధిగా రావాల్సి ఉంది. సరిగ్గా ఈ సమయం చూసి తన మీద పోలీస్ కంప్లయింట్ ఇచ్చారో సామాజిక కార్యకర్త. ఆయన పేరు ఎనోచ్ మోసెస్. అందరూ ఎమి అని పిలుస్తూ ఉంటారు. చెన్నైలో నజరత్ పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసిన ఆయన సన్నీ లియోన్ సినిమాల పేరుతో పోర్న్ కంటెంట్ ని ప్రోత్సహించిందని, వీరమాదేవి పాత్రలో ఆమెను కనక చూపిస్తే తమిళుల మనోభావాలు దెబ్బ తింటాయని అందులో పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇప్పుడు ఈ వేడుకకు రావాలా వద్ద అనే డైలమాలో పడిపోయింది సన్నీ లియోన్. నిర్వాహకులు ఏమి కాదు అని హామీ ఇస్తున్నా నిరసనకారులు మాత్రం అడ్డుకునే తీరతామని హెచ్చరిస్తున్నారు. వీరమాదేవి పాత్రను పోర్న్ స్టార్ తో చేయించడం ఏమిటని భగ్గుమంటున్నారు. నిర్మాతలు మాత్రం పోలీస్ సెక్యూరిటీతో తాము అనుకున్నది చేసే తీరతామని చెబుతున్నారు. ఆ మధ్య న్యూ ఇయర్ వేడుకల కోసం బెంగుళూరులో నైట్ ఈవెంట్ ప్లాన్ చేసి సన్నీ లియోన్ ని పిలిస్తే కన్నడ సంఘాలు ఏకంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నానా హంగామా చేసారు. అది సన్నీ ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు చెన్నై వచ్చినా అదే సీన్ రిపీట్ అయ్యేలా ఉందని భయపడుతోంది.
అయినా ఇమేజ్ ను బట్టి సినిమాలు చేయటం ఇండస్ట్రీలో కామన్. ఒక బ్రాండ్ కు పరిమితమైన సన్నీ లియోన్ ఇతర పాత్రలు చేయకూడదు అనే రూల్ లేదు కాని నిజంగా మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకునే అవసరం అయితే ఉంది. పద్మావతి, మణికర్ణిక ఇలా లేడీ ఓరియెంటెడ్ హిస్టారికల్ సినిమాలన్నీ వివాదాల్లో కూరుకుపోతున్న నేపధ్యంలో వీరమాదేవిని కూడా అవి చుట్టుముట్టడంలో ఆశ్చర్యం లేదు.