సైరా బ్రేక్ ఈవెన్ క‌ష్ట‌మేనా?

Update: 2019-10-06 07:37 GMT
చిరంజీవి 12 ఏళ్ల డ్రీమ్ 'సైరా న‌ర‌సింహారెడ్డి'. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమాకు తొలి రోజు టాక్.. ప్రేక్ష‌కుల స్పంద‌న ఓ రేంజ్‌లో హీటెక్కించింది. విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు.. రివ్యూల‌కు భారీ రేటింగ్‌లు ఇచ్చేశారు. ఇవ‌న్నీ చూశాక 'సైరా' టీమ్ ఆనందానికి అవ‌ధులే లేకుండా పోయాయి. ఇక బాక్సీఫీస్ వ‌ద్ద సైరా స్వైర‌విహార‌మే అని మురిసిపోయారు. రెండ‌వ రోజుకే క‌థ అడ్డం తిరిగింది. మొద‌టి రోజు వ‌సూళ్లు మెగా కాంపౌండ్ లో జోష్ ని నింపితే రెండ‌వ రోజుకు వ‌చ్చే స‌రికి ఆ జోష్ త‌గ్గింది. క‌లెక్ష‌న్లు మంద‌గించాయి. దీంతో ఇదే ప‌రిస్థితి పండ‌గ‌ రోజుల్లో కూడా కొన‌సాగితే బ్రేక్ ఈవెన్ కావ‌డం క‌నుచూపు మేర‌ల్లో కూడా క‌నిపించ‌డం లేదన్న టాక్ వినిపిస్తోంది.

ప్ర‌పంచ వ్యాప్తంగా 74 కోట్ల షేర్‌ని సాధిస్తే అందులో సింహ భాగం ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌దే. ఇరు రాష్ట్రాల్లో క‌లిపి 54 కోట్లు వ‌సూలు చేసింది. మిగ‌తా ఏరియాల నుంచి కేవ‌లం 20 కోట్ల‌కు మాత్ర‌మే రాబ‌ట్ట‌డం ఈ సినిమాకు ప్ర‌ధాన స‌మస్య‌గా మారింది. 200 కోట్ల షేర్ వ‌సూలు చేయ‌గ‌లిగితే త‌ప్ప బ‌య్యర్లు ఒడ్డున ప‌డ‌ని ప‌రిస్థితి. ఈ ద‌స‌రా వీకెండ్ కి సెల‌వులు వుండ‌టం.. పండ‌గ సీజ‌న్ కావ‌డంతో వ‌సూళ్లు పెరిగే అవ‌కాశం వుందని ఆశిస్తున్నారు. అయితే ఎంత పెరిగినా 120 కోట్ల‌కు మించి షేర్ దాట‌డం గ‌గ‌న‌మే అంటూ ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఈ గండం నుండి గ‌ట్టెక్కాలంటే కేవ‌లం తెలుగు రాష్ట్రాల నుంచే వంద కోట్ల‌కు మించి వ‌సూళ్లు సాధించాలి. అది అయ్యే పనేనా అన్న‌ది చూడాలి.

అస‌లింత‌కీ త‌ప్పెవ‌రిది?  ఎక్క‌డ జ‌రిగింది.. అంటే..! 'సైరా' ప‌బ్లిసిటీ స్ట్రాట‌జీ విష‌యంలో జ‌రిగిన త‌ప్పే ఇప్పుడు ఆ సినిమాకు శాపంగా మార‌బోతోంది. 'బాహుబ‌లి', బాహుబ‌లి-2, సాహో చిత్రాల‌కు ఏ స్థాయిలో ప్ర‌చారం చేశారో అంద‌రికి తెలిసిందే. సినిమా రిలీజ్‌కి నెల ముందు నుంచి ప్ర‌చారాన్ని హోరెత్తించారు. కానీ 'సైరా' కు మాత్రం ఆ ప్లాన్ చేయ‌లేదు. ఉత్త‌రాదికి 'సైరా' ఫీవ‌ర్ ని ఎక్కించ‌డంలో చిత్ర యూనిట్ దారుణంగా విఫ‌ల‌మైంది. ఏ అవ‌కాశాన్నీ ప‌క్కాగా వినియోగించుకోలేదు. స్టార్ లు వున్నా వారితో సినిమాకు ప్ర‌చారం చేయించుకోలేక‌పోయారు. సినిమా రిలీజ్ కి నాలుగు రోజుల ముందు ఇత‌ర రాష్ట్రాల్లో ప్ర‌చారానికి వెళ్లారు. ఆర్భాటం చేశారు. దాని వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం వుండ‌ద‌ని గ‌మ‌నించ‌క‌పోవండ‌తో మెగా క్యాంప్ భారీ మూల్యం చెల్లించుకునే ప‌రిస్థితి ఏర్ప‌డ‌బోతోందని ట్రేడ్ పండితులు విసుర్లు వేస్తున్నారు
Tags:    

Similar News