డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఆఫీస్ గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకమైన టాక్ ఉంటుంది. చాలా విభిన్నంగా.. క్రియేటివ్ గా.. అహ్లాదకరంగా పూరి తన ఆఫీస్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఆఫీస్ ను సందర్శించేందుకు పలువురు దర్శకులు హీరోలు కూడా ఆసక్తి చూపిస్తారు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను చర్చించేందుకు పూరి ఏర్పాటు చేసుకున్న ఆఫీస్ కు 'కేవ్' అంటూ పేరు పెట్టుకున్నాడు. ఈ కేవ్ లో అడుగు పెట్టిన వారికి.. అక్కడ పని చేసే వారికి కొన్ని కండీషన్స్ ను పూరి పెట్టాడు.
పూరి కేవ్ లో స్మార్ట్ నెస్ ఓకే కాని ఓవర్ స్మార్ట్ నెస్ మాత్రం కుదరదు. పనిలో సరదా ఓకేకాని పనితో సరదా మాత్రం కుదరదు. తప్పులు ఓకే కాని అశ్రద్ద మాత్రం కుదరదు. అందరిని ప్రేమించడం ఓకే కాని ఒక్కరిని ప్రేమించడం మాత్రం అక్కడ కుదరదట. టీం వర్క్ ఓకే కాని.. గ్రూప్ లు కట్టడం మాత్రం కుదరదు. మోటివేషన్ ఓకే కాని ఈగో మాత్రం అనుమతింపబడవు. పనిలో ఉన్న సమయంలో నవ్వడం.. ఆడటం ఓకే కాని అన్ని కూడా ఒక లిమిట్ వరకే ఎందుకంటే ఏదైనా అతి చేస్తే డేంజర్ అని కేవ్ లో ఉంటుంది.
ఇక కేవ్ ఎంట్రీలో కూడా ఆసక్తికరమైన ఒక వ్యాఖ్యం ఉంటుంది. అదేంటీ అంటే మీ ఫూట్ వేర్ ను ధరించి లోనికి రావచ్చు. కాని మీ ఈగోను మాత్రం బయటే వదిలేయండి అంటూ ఉంటుంది. చాలా పోష్ గా అత్యంత ఆధునిక హంగులతో ఎక్కడ చూడనటువంటి ఇంటీరియర్ తో పాటు ఇలాంటి సూక్తులతో పూరి కేవ్ చాలా విభిన్నంగా ఉంటుంది.