బిగ్ బాస్-4 పై భిన్నాభిప్రాయాలు.. కెరీర్ ఉంటుందంటారా..??

Update: 2020-07-09 13:30 GMT
టీవీలో ప్రసారం అయ్యే కొన్ని రియాలిటీ షోలు ప్రేక్షకుల పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. అలాంటి రియాలిటీ షోలలో ఒకటి బిగ్ బాస్. గత మూడు సీజన్లుగా తెలుగు బుల్లితెరపై విజయవంతంగా ప్రదర్శించ బడుతుంది. కరోనా ప్రభావం తగ్గితే ఈ ఏడాది జూలైలో నాలుగో సీజన్‌ ప్రారంభించాలని నిర్వాహకులు భావించారు. కానీ కరోనా తగ్గలేదు బిగ్ బాస్ కుదరలేదు. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్లు, హోస్ట్‌ల కోసం నిర్వాహకులు ఇప్పటికే పలువురితో సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే ఈ రియాల్టీ షోలో కంటెస్టెంట్‌లుగా పాల్గొనేందుకు ఎవ్వరూ ఆసక్తిి చూపడం లేదని కొన్ని వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అందుకు కారణాలు కూడా ఉన్నాయట. నిజానికి బిగ్‌బాస్‌ షోపై చాలా మందికి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని సమాచారం. ఎందుకంటే హిందీ బిగ్‌బాస్‌లో చూసినట్లయితే..

అందులో పాల్గొన్న కంటెస్టెంట్లు షో ముగిసిన తరువాత పెద్ద పెద్ద ఆఫర్లు దక్కించుకుంటున్నారు. కానీ తెలుగు బిగ్ బాస్ లో పరిస్థితి వ్యతిరేకంగా ఉందంటున్నారు. బిగ్‌బాస్‌లో పాల్గొని హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తరువాత ఎవ్వరికీ పెద్దగా ఆఫర్లు రావడం లేదట. కంటెస్టెంట్లు మాత్రమే కాదు బిగ్‌బాస్ విన్నర్‌లకు కూడా షో తరువాత అడపాదడపా అవకాశాలు మాత్రమే పొందుతున్నారట. బిగ్ బాస్ లోకి వెళ్తే కెరీర్ ఉంటుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలో ప్రారంభించబోయే నాలుగవ సీజన్ ఆగస్టు నుండి ప్రారంభం కానుందని సమాచారం. ఇక ఈ నాలుగో సీజన్ హోస్ట్ కూడా కింగ్ నాగార్జునేనట. అయితే కరోనా టైంలో స్టార్ మా మేనేజ్మెంట్ నాగార్జున రెమ్యూనరేషన్ తగ్గిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా స్టార్ మా మేనేజ్మెంట్ దీనిపై క్లారిటీ ఇచ్చిందట. నాగార్జున రెమ్యూనరేషన్లో ఎలాంటి తగ్గింపు చేయట్లేదని.. మూడవ సీజన్లో ఎంత ఇచ్చారో అంతే ఇప్పుడు కూడా చెల్లిస్తున్నట్లు తెలిపారట. ఇక అన్నీ కుదిరితే ఆగస్టు నుండి షో ప్రారంభం చేస్తామని అన్నట్లు టాక్.
Tags:    

Similar News