హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి నవతరం దర్శకులపై ఉంటుందనడంలో సందేహం లేదు. ఏదైనా ఎగ్జయిట్ చేసిన పాయింట్ దొరికితే ఆ స్ఫూర్తితో కథలు రాయడం అలవాటుగా మారింది. అయితే అలా చేస్తే దానిని కాపీ అనాలా.. లేక స్ఫూర్తి మాత్రమే అని అనాలా? యథాతథంగా సినిమా మొత్తం కాపీ పేస్ట్ చేసేంత తెలివి తక్కువగా ఎవరూ ఉండరు. అదే లైన్ లేదా థీమ్ ని తీసుకుని అందులోకి తెలివిగా నేటివిటీ సీన్స్ ని పంప్ చేసి తీస్తే అదో కొత్త సినిమా. ఇటీవల టాలీవుడ్ లో రిలీజవుతున్న చాలా సినిమాలకు ఏదో ఒక హాలీవుడ్ స్ఫూర్తి కనిపిస్తోంది. మొన్న రిలీజైన ఇస్మార్ట్ శంకర్ కి `ది కిల్లర్` చిత్రంలోని మెమరీ చిప్ స్ఫూర్తిని ఎవరూ కాదనలేనిది. పూరి సైతం ఆ సంగతిని ఒప్పుకున్నారు.
అయితే ఇప్పటికిప్పుడు అలాంటి కాపీలు ఇంకెక్కడ ఉన్నాయి? అని వెతికితే .. సౌత్ లోనే ఒకేసారి తెరకెక్కుతున్న ఓ రెండు సినిమాలపై ఈ తరహా ప్రచారం సాగుతోంది. తమిళంలో జయం రవి హీరోగా తెరకెక్కిన `కోమలి` 1996 బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీ `బ్లాస్ట్ ఫ్రమ్ ది పాస్ట్` స్ఫూర్తి అని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో కూడా కొన్ని సంవత్సరాల పాటు కోమాలో ఉండిపోయి బయటికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో రూపొందించారు. ఇందులో మమ్మీ 2 హీరో బ్రెండన్ ఫ్రాజర్ నటించారు. ఈనెలలో కోలీవుడ్ లో రిలీజ్ కి వస్తున్న `కోమలి` చిత్రంలో హీరో పాత్ర ఇంచుమించు అదే. కోమాలో ఉన్న హీరో దాదాపు పదహారేళ్ల తర్వాత మెలకువ వచ్చి బయటి ప్రపంచాన్ని చూశాక ఏం జరిగింది? అన్నది ఆద్యంతం ఫన్నీగా తెరకెక్కించారు. ఇటీవలే రిలీజైన ట్రైలర్ ఆకట్టుకుంది.
ఇలాంటి కాన్సెప్టుతో వేరొక సినిమా ఏది వస్తోంది? అంటే.. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న `డిస్కో రాజా` పేరును ప్రస్థావిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా టైగర్.. ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్ రూపొందిస్తున్న థ్రిల్లర్ చిత్రమిది. రవితేజ బర్త్ డే సందర్భంగా రివీల్ చేసిన మోషన్ పోస్టర్ లో డైరెక్టర్ కొంత క్లూ కూడా ఇచ్చేశాడు. ``రివైండ్.. ఫాస్ట్ ఫార్వార్డ్.. ప్లే.. కిల్`` అనే ఆప్షన్స్ పోస్టర్ పై చూశాక కచ్ఛితంగా ఈ సినిమా కథాంశం హాలీవుడ్ స్ఫూర్తితోనే అనే సందేహాలు కలిగాయి. అంతేకాదు ఈ సినిమాని 1980 బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నారు. రవితేజ తండ్రి కొడుకుగా ద్విపాత్రలు చేస్తున్నారు. ఇందులో ఒక పాత్ర కోమాలో ఉంటుంది! అని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకూ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కానీ ఏదీ రాలేదు కాబట్టి కామెంట్లు చేయడం సరికాదు. ఇదంతా ఇప్పటికి ఫిలింనగర్ గుసగుస మాత్రమే. ఇదివరకూ రవితేజ నటించిన `రాజా ది గ్రేట్` చిత్రానికి హాలీవుడ్ స్ఫూర్తి ఉందని విమర్శలు వచ్చాయి. 1990లో రిలీజైన `బ్లైండ్ ఫ్యూరి` అనే చిత్రంలో అంధుని పాత్రను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన చిత్రమని విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే.
Full View