కోవిడ్-19 కొత్త వేరియేంట్ ఓమిక్రాన్ భారత్ లోనూ చాపకింద నిరులా విస్తరిస్తోంది. కొత్త ఏడాది నుంచి ఓమిక్రాన్ ఉగ్రరపం దాల్చుతుందని నివేదికలు చెబుతున్నాయి. అదే జరిగితే భారత్ లో మళ్లీ లాక్ డౌన్ తప్పదు. ఇప్పటికే కొన్ని రాష్ర్టాల్లో నైట్ కర్‌ఫ్యూ అమలులో ఉంది. ప్రభుత్వాలు ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి. ఇక బాలీవుడ్ సెలబ్రిటీల్ని కరోనా ఓ రేంజ్ లో వెంటాడింది. ఫస్ట్ వేవ్..సెకెండ్ వేవ్ లో కొవిడ్ కారణంగా పలువురు సెలబ్రిటీలు వైరస్ బారిన పడ్డారు. తాజాగా కపూర్ ఫ్యామిలీ మరోసారి కోవిడ్ బారిన పడినట్లు తెలుస్తోంది.
అర్జున్ కపూర్..అన్షులా కపూర్.. రియా కపూర్..కరణ్ బూలానీలకు వైరస్ సోకింది. ప్రస్తుత వీరంతా హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. బోనీకపూర్ కి నీరసంగా ఉండటంతో పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. అలాగే అనీల్ కపూర్ కి కూడా నెగిటివ్ వచ్చింది. కపూర్ ఫ్యామిలీలో మిగతా సబ్యులకు పరీక్షలు చేయగా అంతా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం అర్జున్ కపూర్ ముంబై సబర్బన్ లోని ఒక హోటల్ లో కుటుంబానికి దూరంగా బస చేస్తున్నారు.
అలాగే రణవీర్ షోరే కుమారుడు హరూన్ సెలవులు కావడంతో గోవా వెళ్లాడు. అక్కడ నుంచి తిరిగి రాగానే ఆర్ పీసీఆర్ పరీక్ష చేయగా పాజిటివ్ అని తేలింది. టీకా వేసుకున్నప్పటకి పాజిటివ్ రావడంతో మరోసారి రీటెస్ట్ కి రెడీ అవుతున్నారు. అయితే ఓవైపు ఓమిక్రాన్ విస్తరిస్తున్నా సాధారణ కోవిడ్ నే వీళ్లందరికీ సోకినట్లు తెలుస్తోంది. ఓమిక్రాన్ వేరియంట్ విషయంలో పెద్దగా భయపడేది లేదని నిపుణులు చెబుతున్నా...సెకెండ్ వేవ్ ఇచ్చిన షాక్ తో అంతా భయాందోళనకు గురవుతున్నారు.