ఊరికే తిని కూకుంటే మడిషికి గొడ్డుకి తేడా ఏటుంటాది? అని ప్రశ్నించారు ది గ్రేట్ వెటరన్ ఆర్టిస్ట్ రావు గోపాల్రావ్. ఆ మాటల్ని ప్రతి ఒక్కరూ పదే పదే స్ఫురణకు తెచ్చుకోవాలి వీళ్లను గమనిస్తే... ముఖ్యంగా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులందరూ ఆయననే ఆది గురువు అని భావించి ఆ మాటను తూ.చ తప్పక ఆచరిస్తుంటారు. ఆయన్ని అనుసరించడంలో కొందరు వెటరన్ ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు ఎందులోనూ తీసిపోరు. అదే కోట్లలో ఆర్జించేందుకు సాయమైంది. అది సరే కానీ వీళ్లు ఎవరెవరు? అంటే... కాస్త డీటెయిల్స్ లోకి వెళ్లాలి.
ఇండస్ట్రీలో క్షణమైనా తీరిక లేకుండా నిరంతరం షూటింగుల బిజీతో ఉండే క్యారెక్టర్ ఆర్టిస్టుల వివరాలు ఆరా తీస్తే .. అందులో ఓ మూడు పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అందులో రావు రమేష్ - నాజర్ - మురళి శర్మ .. ఈ ముగ్గురూ సీనియర్లు. లక్షల్లో రోజువారీ ఆదాయంతో బాగానే ఆర్జిస్తున్నారు. డెయిలీ వేజెస్ లా తీసుకున్నా ఏడాదికి వీళ్లకు రూ.10 కోట్ల నుంచి 12 కోట్ల మేర ఆదాయం ఉంటుందన్నది అంచనా. అయితే కరోనా ప్రభావం వీళ్లపై ఎంత? ప్రస్తుత సన్నివేశమేమిటి? అంటే.. షూటింగులు బంద్ అవ్వడంతో వీళ్లపై గట్టి ప్రభావమే పడిందని తెలుస్తోంది. షూటింగులు లేక రోజు వారీగా అందుకునే లక్షల్లో సొమ్ములు లేక పాపం విలవిలలాడుతున్నారు. ఆ ముగ్గురితో పాటు ఇటీవల పాపులరైన నవతరం క్యారెక్టర్ ఆర్టిస్టుల సన్నివేశం ఇదే. వీళ్లంతా డైలీ భత్యంపైనే బోలెడంత ఆర్జిస్తుంటారు. ఇక ప్యాకేజీల సంగతి పక్కన పెడితే వీళ్లు ఎప్పుడూ ఖాళీగా ఉండడానికి అస్సలు ఇష్టపడరు. వెరసి లాక్ డౌన్ అయ్యాక వీరి విలువ తప్పనిసరిగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ లాక్ డౌన్ తరువాత డేట్స్ వేరే వాళ్లకి ఇచ్చేసి ఉంటారు కాబట్టి... ఆ డేట్స్ క్లాష్ కూడా వీళ్ల నెత్తి మీద పడబోతోంది.
ఇవన్నీ పక్కన పెడితే.. సదరు ఆర్టిస్టులంతా ఏడాదికి 10 కోట్లు పైగానే సంపాదిస్తారు. మరీ ఈ సొమ్ములంతా ఏం చేస్తున్నారు? కరోనా కల్లోలంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న సినిమా కార్మికులను ఆదుకునే సాయం చేయరా?స్టార్లంతా సాయం ప్రకటించినా వీరు మాత్రం కనీస సాయానికి .. సంపాదించిన దాంట్లో కొంత వెనక్కి ఇవ్వడానికి ఏమాత్రం ముందుకు రావడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెట్స్ లో సినీవర్కర్స్ లేకుండా కించిత్ కాలు అయినా కదపలేరు... సిగ్గుండాలి! అంటూ చీవాట్లు వేస్తున్నారు కొందరైతే.
``చాలా ఇచ్చింది మా ఊరు నాకు.. ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలిగా.. లేకపోతే లావు అయిపోతాను! అంటూ శ్రీమంతుడు డైలాగ్ పదే పదే వల్లించే వీళ్లంతా కనీసం ఇండస్ట్రీ కోసం ఏమీ ఇవ్వరా?`` ఇండస్ట్రీని వీళ్లెవరూ మా ఊరు అని సెంటిమెంట్ అయినా ఫీలవ్వరా? ఏమిటీ స్వార్థం? ఒక్కరు కూడా నిధి సాయానికి ముందుకు రాలేదు. కనీసం నిత్యావసరాలు పంచలేదు... సిగ్గు లేదా? అని అంతా ప్రశ్నిస్తున్నారు.