కరోనా టాలీవుడ్ లో డేంజర్ బెల్ మోగిస్తోంది. వచ్చే నెల వరకూ దీని తీవ్రత తగ్గినా జనాలు మాత్రం అప్పుడిప్పుడే ఈ మహమ్మారిని మరిచిపోరు. సామాజిక దూరం పాటిస్తారు. ఇప్పుడే ఇదే టాలీవుడ్ పాలిట శాపంగా మారనుంది.
2020 టాలీవుడ్ కు బాగా కిక్కిచ్చింది. ఏకంగా ఇద్దరూ సూపర్ స్టార్లు కొదమ సింహాల్లో సంక్రాంతి బరిలో పోటీపడ్డారు. అల్లు అర్జున్, మహేష్ బాబు ల రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో టాలీవుడ్ కు ఊపు వచ్చింది. ఈ సమ్మర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ పెద్ద సినిమాల రిలీజ్ కు ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు కరోనా వైరస్ టాలీవుడ్ నే కాదు.. దేశ సినీ పరిశ్రమనే చావు దెబ్బ తీస్తోంది.
కరోనాతో లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. ఈ సమ్మర్ కు రిలీజ్ కావాల్సిన పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ వాయిదా పడే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు జనాలు రద్దీగా ఉండే థియేటర్స్ లో సినిమాలు చూసే అవకాశాలు లేవు. కరోనా భయానికి జనాలు థియేటర్స్ రావడం కష్టమే. ఈ ఏడాది మొత్తం కరోనా భయంతో జనం సామూహికంగా కలవలేరు. ఇది సినిమా పరిశ్రమను చావు దెబ్బ తీయడం ఖాయంగా కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ సినిమానే కాదు.. ప్రభాస్ కొత్త సినిమా ఆగిపోయింది. ఇక అల్లు అర్జున్-సుకుమార్ సినిమా కరోనా దెబ్బతో మొదలే కాలేదు. ‘ఆర్ఆర్ఆర్’ పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేస్తామని ఆశించారు. కానీ ఇప్పుడు అదీ పూర్తి చేస్తారో లేదో తెలియని పరిస్థితి.
ఇక స్టార్ హీరో మహేష్ బాబు కొత్త చిత్రం పట్టాలెక్కాల్సింది.. పరుశురామ్ తో ఆయన చిత్రం మొదలే కాలేదు. చిరంజీవి ‘ఆచార్య’ ఆగిపోయింది.
ప్రస్తుతం ఈ ఏడాది ఇప్పటివరకు షూటింగ్ అయిపోయి డబ్బింగ్ కోసం ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మాత్రమే విడుదలయ్యే అవకాశాలున్నాయి. అదీ ఇప్పటికిప్పుడు కాదు. కరోనా పూర్తిగా తగ్గి దాని ప్రభావం లేదని తెలిస్తేనే జనాలు థియేటర్స్ కు వస్తారు. లేదంటే పవన్ సినిమా కూడా ఈ ఏడాది చివరకు వాయిదా పడుతుంది. ఇప్పుడు కరోనా దెబ్బకు ఈఏడాది మొత్తం విడుదలయ్యే సినిమా ఒకే ఒకటి అది పవన్ చిత్రమేనని తెలుస్తోంది. దీంతో సినీ పరిశ్రమ కుదేలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.