పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా మరియు ఓవర్సీస్ లో భారీ ఎత్తున స్క్రీన్స్ లో సినిమాను విడుదల చేయడం జరిగింది. ఓవర్సీస్ లో ముఖ్యంగా యూఎస్ లో భారీ ఎత్తున సినిమా ను విడుదల చేయడం జరిగింది. మొదటి రోజు సినిమా ను అత్యధిక స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. సినిమాకు భారీ ఓపెనింగ్స్ అయితే నమోదు అయ్యాయి. కాని లాంగ్ రన్ లో అది కూడా వీక్ డేస్ లో వకీల్ సాబ్ కు యూఎస్ లో పెద్దగా వసూళ్లు రాలేదు. కరోనా భయం కారణంగా జనాలు థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదనిపిస్తుంది.
యూఎస్ లో ఇప్పటి వరకు ఈ సినిమా ఏడు లక్షల డాలర్లను వసూళ్లు చేసినట్లుగా చెబుతున్నారు. మిలియన్ మార్క్ కు కూడా దూరంగానే ఉన్న వకీల్ సాబ్ బ్రేక్ ఈవెన్ సాధించేందుకు ఇంకా కష్టపడాల్సిందే. అయితే ఈ వారంలో పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం వల్ల మళ్లీ వకీల్ సాబ్ సినిమా కు శని ఆది వారాల్లో జనాలు క్యూ కడితే అప్పుడే బ్రేక్ ఈవెన్ సాధ్యం అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. మరి రెండవ వీకెండ్ కు వకీల్ సాబ్ యూఎస్ లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఈ సినిమా బిజినెస్ జరిగింది. పవన్ కళ్యాణ్ స్టామినా మరియు క్రేజ్ నేపథ్యంలో ఈజీగానే ఇక్కడ బ్రేక్ ఈవెన్ సాధ్యం అయ్యిందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్సీస్ లో కూడా ఇంకాస్త ఎక్కువ ప్రమోట్ చేస్తే సినిమా తప్పకుండా బ్రేక్ ఈవెన్ ను సాధిస్తుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఓవర్సీస్ లో తెలుగు సినిమాలకు ఆశించిన స్థాయిలో ఫలితం దక్కడం లేదు. గతంలో నైజాం ఏరియా మాదిరిగా అక్కడ కూడా వసూళ్లు నమోదు అయ్యేవి. మళ్లీ ఆ రోజులు కరోనా పూర్తిగా పోయిన తర్వాతే వస్తాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.