హీరో కి పాజిటివ్.. హీరో గర్ల్ ఫ్రెండ్ కి నెగెటివ్..!

Update: 2021-03-09 11:05 GMT
దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ కొన‌సాగుతోంది. ముఖ్యంగా ముంబైలో మ‌హ‌మ్మారి ప్ర‌తాపం చూపిస్తోంది. తాజాగా.. బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్ బీర్ క‌పూర్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఆయ‌న హోమ్ క్వారంటైన్లో ఉన్న‌ట్టు ఆయ‌న త‌ల్లి వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన కొవిడ్ ప‌రీక్ష‌ల్లో రణ్ బీర్ కు పాజిటివ్ రిపోర్టు వ‌చ్చింద‌ని, దీంతో ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్న‌ట్టు ఆయ‌న త‌ల్లి నీతూ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు.

అయితే.. ప్ర‌స్తుతం ర‌ణ్ బీర్ 'బ్రహ్మాస్త్ర‌' సినిమాతో బిజీగా ఉన్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. నాగార్జున, అమితాబ్ బ‌చ్చ‌న్‌ ముఖ్య‌పాత్రల్లో న‌టిస్తున్నారు. ఇటీవ‌లే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న నాగ్.. హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చారు.కాగా.. షూట్ స‌మ‌యంలో వీరంతా క‌లిసే ఉన్నారు. దీంతో వీరికి వైర‌స్ వ్యాపించే అవ‌కాశం ఉంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. అయితే.. అలియా భ‌ట్ ప‌రీక్ష‌లు చేయించుకోగా నెగెటివ్ రిపోర్ట్ వ‌చ్చింద‌ని స‌మాచారం.
Tags:    

Similar News