టాలీవుడ్ రిలీజ్ ల‌పై 'క‌రోనా' క‌ల్లోలం

Update: 2020-03-14 07:45 GMT
ప్ర‌పంచ దేశాల్ని గ‌జ‌గ‌జ ఒణికిస్తున్న క‌రోనా పంచ్ వినోద‌ప‌రిశ్ర‌మ‌పైనా అసాధార‌ణంగా ఉందన్న‌ది విశ్లేష‌కుల మాట‌. హాలీవుడ్ టు టాలీవుడ్ క‌రోనా ప్ర‌భావం  ఓ రేంజులో ఉంద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. ఇక థియేట‌ర్ల మూత అన్న టాపిక్ అంత‌కంత‌కు వేడెక్కించేస్తోంది. ప్ర‌స్తుతం టాలీవుడ్ క‌రోనా క‌ల్లోలానికి గ‌జ‌గ‌జ ఒణికిపోతోంది. దీనికి తోడు థియేట‌ర్ల బంద్ చేయాలా వ‌ద్దా? అన్న‌దానిపైనా నిర్మాత‌లు.. పంపిణీదారులు..ఎగ్జిబిట‌ర్ల‌తో స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ప‌ది రోజుల పాటు థియేట‌ర్ల‌ను మూత వేయాల‌న్న డిమాండ్ ఇప్ప‌టికే నెల‌కొన్న నేప‌థ్యంలో ప‌ర్య‌వ‌సానాలేమిటి? అన్న‌దానిపైనా చ‌ర్చ సాగ‌నుంద‌ని తెలుస్తోంది.

అయితే థియేట‌ర్ల మూత‌పై పంపిణీ వ‌ర్గాల్లో బిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని తెలుస్తోంది. ప‌దిరోజుల వాయిదా వ‌ల్ల వారం వారం రిలీజ్ ల‌కు ఇబ్బందిక‌రం అన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఈనెల 25న రిలీజ్ కానున్న వీ సినిమాని వాయిదా వేయాల్సిన ప‌రిస్థితి ఉంది. అలాగే ఏప్రిల్ లో రానున్న పెద్ద సినిమాల రిలీజ్ లు వాయిదా వేయాల్సి ఉంటుంద‌ని విశ్లేషిస్తున్నారు. అయితే పెద్ద సినిమాల రిలీజ్ లు ఆపాలంటే ఇత‌ర సినిమాలపైనా ఆ ప్ర‌భావం ప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదు. దీని ప‌ర్య‌వ‌సానాలేమిటి? అన్న‌ది కూడా విశ్లేషించనున్నార‌ని తెలుస్తోంది. ఇక వీ సినిమాని వాయిదా వేస్తే.. ఆ త‌ర్వాత రిలీజ్ ల‌ను కూడా సీక్వెన్సులా వాయిదా వేయాల‌న్న ప్ర‌తిపాద‌నా పంపిణీదారుల్లో ఉంద‌ని తెలుస్తోంది.

ఇక థియేట‌ర్ల బంద్ వ్య‌వ‌హారం పంపిణీదారుడు సుధాక‌ర్ రెడ్డి వ్య‌తిరేకిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే థియేట‌ర్ లో విజ‌య‌వంతంగా ర‌న్ అవుతున్న భీష్మ‌కు ఇబ్బందిర‌కం అని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. ఇక ఏప్రిల్ 2 వ‌ర‌కూ వేరే పెద్ద సినిమాలేవీ లేక‌పోవ‌డం భీష్మ‌కు క‌లిసి రానుంది. ప్ర‌స్తుతం కుటుంబ స‌మేతంగా వీక్షించే సినిమా ఇదొక్క‌టే కాబ‌ట్టి ఆ మేర‌కు భారీగా షేర్ రాబ‌ట్ట వ‌చ్చ‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న అని తెలిసింది. ఏదైతేనేం.. క‌రోనా క‌ల్లోలం టాలీవుడ్ పై ఓ రేంజులో ఉంద‌ని తాజా ప‌రిణామం చెబుతోంది. థియేట‌ర్లు బంద్ చేస్తే ఆ ప్ర‌భావం చైన్ సిస్ట‌మ్ ని పెద్ద రేంజులోనే ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది.
Tags:    

Similar News