కరోనా డేస్ లో వారికి మినహాయింపు ఇస్తారా...??

Update: 2020-03-25 03:30 GMT
ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా అనే కంటికి కనిపించని సూక్ష్మజీవి గుప్పిట్లో ఉందని చెప్పవచ్చు. అది చెప్పిందే ప్రపంచం చేస్తుంది. అది చెప్పిందే ప్రపంచం వింటోంది. కరోనా ప్రభావం ఎక్కువగా పడిన రంగాల్లో సినీరంగం ఒకటి. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కరోనా ఎఫెక్ట్ ఈ ఏడాది చివరి వరకు కొనసాగినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మల్టీప్లెక్సలు, థియేటర్లు మూసి వేయడంతో నిర్మాతలు డిస్టిబ్యూటర్స్ - థియేటర్ల ఓనర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. సినిమాలు అన్నీ తమ విడుదలను వచ్చే నెలకు వాయిదా వేసుకున్నాయి. ఏప్రిల్ లో కూడా విడుదలయ్యే అవకాశం లేకపోవడంతో సినీ ఇండస్ట్రీలో అందరూ తలలు పట్టుకు కూర్చున్నారు.

ఇదిలాగే కొనసాగితే టాలీవుడ్ చరిత్రలో కనీ విని ఎరగని నష్టాలని చూసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మాములుగా సినిమా అనేది కొన్ని కోట్లతో కూడుకున్న వ్యవహారం. అంత మొత్తంలో డబ్బు నిర్మాత దగ్గర ఉండి అవకాశాలు తక్కువ. అలాంటప్పుడు వీరు ఫైనాన్సియర్లను ఆశ్రయిస్తుంటారు. సాధారణంగా ఇంత మొత్తంలో వడ్డీ అని మాట్లాడుకుని ముందుకు వెళ్తుంటారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో నిర్మాతలు ఫైనాన్సియర్లకు వడ్డీ చెల్లించే పరిస్థితిలో లేరు. వడ్డీలు తీసుకున్న నిర్మాతలకు ఈ కరోనా డేస్ కి మినహాయింపు ఇస్తారా అంటే ఏమో డౌటే అని చెప్పొచ్చు.

వాస్తవానికి సీడెడ్ ఏరియా నుండి ఎక్కువ మంది ఫైనాన్సియర్స్ ఉన్నారు. వీళ్ళు చాలా న్యాయంగా - నిజాయతీగా ఉంటారు. అదేవిధంగా అంతే కఠినంగా కూడా ఉంటారు. మరి ఈ కరోనా డేస్ లో వీరు నిర్మాతల పక్షం వహిస్తారేమో చూడాలి. కెకరోనా తగ్గే వరకు నిర్మాతల విషయంలో కొంచం పెద్ద మనసుతో వ్యవహరిస్తే నిర్మాతలు అంతో ఇంతో గట్టెక్కే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
   

Tags:    

Similar News