మన దేశంలో ఏదైనా ఓ కేసు కోర్టుకు చేరిందంతే.. తీర్పు వచ్చేలోపు ఖచ్చితంగా అందులో నిమగ్నమైన జనాలందరికీ అలసటతో పాటు ఆయాసం, దగ్గు, షుగర్ కూడా వచ్చేస్తాయి. ఏమన్నా అంటే కోర్టు తీర్పులై కామెంట్లు చేయకూడదు అంటుంటారు కాని, అసలు ఈ ''మా'' ఎలక్షన్స్ విషయంలో లైన్ క్లియర్ చేసేదెప్పుడండీ బాబూ?
రాజేంద్రప్రసాద్, జయసుధ ప్రెసిడెంట్ బరిలో నుంచున్న ఎలక్షన్స్.. సరిగ్గా జరగట్లేటదంటూ ఓ.కళ్యాణ్ అనే యాక్టర్ కోర్టులో కేసు వేశారు. ఇకపోతే ఎన్నికలు జరుపుకోండి కాని విన్నర్‌ను మాత్రం డిక్లేర్ చేయకండి అంటూ కోర్టు అడ్డేసింది. అయితే సదరు కేసు విషయంలో వీడియో ఫుటేజ్ కావాలని ఓ రోజు తీర్పు, మురళీమోహన్-ఆలీ కౌంటర్ దాకలు చేయలేదని ఒకరోజు.. ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతూ మహాభారతంలోని అధ్యాయాలు అన్నీ చదివించేస్తున్నారు కాని.. అసలు ఎన్నికల ఫలితాలు జరుపుకోండి అనే మాట కోర్టు నుండి రావట్లేదు. ఈ లేటు కారణంగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి విసుగొస్తోంది మరి. ఇక ఈరోజు మా ఎలక్షన్లపై వేసిన పిటీషన్‌లో వాయిదా జరగనుంది. మరి ఇవాళైనా కర్టెన్ తీసి, రిజల్ట్ చెప్పుకోండి అంటారా?