భార్యా భ‌ర్త‌ల న‌డుమ ఊహించ‌ని ఆ ఇబ్బంది

Update: 2021-10-01 02:30 GMT
క‌రోనా మ‌హ‌మ్మారీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా అల్ల‌క‌ల్లోలం సృష్టించింది. ఎంద‌రినో ఎన్నో ర‌కాలుగా ఇబ్బందుల‌కు గురి చేసింది. భార్యాభ‌ర్త‌ల‌ను కూడా ఒక‌రి నుంచి ఒక‌రికి దూరం చేసింది. కొత్త జంట‌ల‌కు ఈ ఇబ్బంది త‌ప్ప‌లేదు. ముఖ్యంగా విదేశాల్లో స‌ప‌రేట్ గా ఉన్న త‌మ వారిని క‌లుసుకునేందుకు తీవ్ర ఆటంకంగా మారింది. వ్యాక్సినేష‌న్ లేని ప్ర‌యాణీకుల‌కు విమాన‌యానం నిషేధం విధించ‌డంతో అమెరికాకు వెళ్ల‌లేని దుస్థితి. ఇదే స‌న్నివేశం హీరో సుమంత్ అశ్విన్ ని ఇబ్బందికి గురి చేసింది. హీరో సుమంత్ అశ్విన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నాడు. అతని భార్య దీపిక చికాగోలోని ఒక యూనివర్సిటీలో రీసెర్చ్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు. వివాహం అయిన వెంటనే ఆమె జాబ్ లో చేరాలి. దీంతో ఆమె వెళ్లారు. సుమంత్ అశ్విన్ తన భార్యను కలవడానికి అక్కడికి వెళ్లాల్సి ఉంది. కానీ COVID-19 వ‌ల్ల ప్లాన్ చెడిపోయింది. అమెరికాకు వెళ్లే భారతీయ ప్రయాణికులపై ఆంక్షల కారణంగా అతను తన భార్యను కలవలేకపోయాడు. ఇదిలా ఉండగా అమెరికా ప్రభుత్వం నవంబర్ నుంచి పూర్తిగా టీకాలు వేసిన భారతీయ ప్రయాణికులకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.

అయితే.. కోవాక్సిన్ USFDA లేదా WHO ఆమోదించిన టీకాల జాబితాలో లేదు. సుమంత్ అశ్విన్ కోవాక్సిన్ టీకాను వేయించుకున్నాడు. ప్రయాణ నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత కూడా తన భార్యను ఎలా చేరుకోవాలో సందిగ్ధంలో ఉన్నాడు. ఇది కేవలం అత‌డి సందిగ్ధత మాత్రమే కాదు.. కోవాక్సిన్ తీసుకున్నా కానీ వారి ప్రియమైన వారి నుండి విడిపోయిన చాలామందికి సంబంధించిన గందరగోళమిది. మరింత అద‌న‌పు సమాచారం అవసరమని పేర్కొంటూ డబ్ల్యూహెచ్ ఓ కోవాక్సిన్ ఆమోదాన్ని నిలిపివేయ‌డంతో ఇది త‌లెత్తింది.

సుమంత్ అశ్విన్ కెరీర్ కి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ‌స‌రం. అత‌డు న‌టించిన‌ ఇదే మా కథ చిత్రం అక్టోబర్ 2 న విడుద‌ల కానుంది. రోడ్ ట్రిప్ నేప‌థ్యంలో చిత్ర‌మిది. ఈ మూవీపై చాలా ఆశ‌లున్నాయి. నిర్మాత‌గానూ అత‌డు ప‌లు చిత్రాల్ని నిర్మిస్తూ బిజీగా ఉన్నాడు.
Tags:    

Similar News