అజయ్ దేవ‌గ‌ణ్ -మ‌హేష్ మ‌ధ్య క్రేజీ కంపారిజ‌న్!

Update: 2022-04-30 15:30 GMT
బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. హిందీ ప‌రిశ్ర‌మ స్టార్ హీరోల్లో ఆయ‌న ఒక‌రు. హీరోగా సినిమాలు చేస్తూనే అప్పుడ‌ప్పుడు ఇత‌ర స్టార్ హీరోల సినిమాల్లోనూ కీల‌క పాత్ర‌ల్లో భాగ‌మ‌వుతుంటారు. పాత్ర న‌చ్చిందంటే భాష‌తో సంబంధం సంబ‌ధంలేకుండా న‌టిస్తారు. అలా ఇటీవ‌లే పాన్  ఇండియా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'  లో కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే.

ఇందులో రామ్ చ‌ర‌ణ్ తండ్రిగా వెంక‌ట‌రామ‌రాజు పాత్ర‌లో అజ‌య్ క‌నిపించారు. వెక‌ట‌రామ‌రాజు పాత్ర తెర‌పై క‌నిపించినంత సేపు ఎంతో ఫ‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంది.  ఉద్య‌మనాయ‌కుడిగా..విప్ల‌వ స్ఫూర్తిని ర‌గిలించే పాత్ర‌లో అజ‌య్ న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. అలాగే బాలీవుడ్ సినిమా అలియాభ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెకెక్కిన 'గంగూబాయి క‌తివాడి' స‌క్సెస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

అలియా భ‌ట్ ఇమేజ్ నే మార్చేసిన చిత్ర‌మిది. ఇందులో కూడా అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టించారు. ర‌హీమ్ లాల్ పాత్ర‌లో అజ‌య్ న‌ట‌న గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమాలో పాత్ర అద్భుతంగా పండింది. అలా అజ‌య్ ఏక కాలంలో రెండు స‌క్సెస్ ఫుల్ చిత్రాల్లో భాగ‌మై  వ‌రుస విజ‌యాలు అందుకున్నారు. ఈ రెండు సినిమాలు కూడా భారీ బ‌డ్జెట్ తో  నిర్మాణం జ‌రిగినే.

'ఆర్ ఆర్ ఆర్' 400  కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కితే గంగూబాయి 150 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కింది. అయితే ఇంత‌టి ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ ల్లో భాగ‌మైన అజ‌య్ ఈ  రెండు సినిమాల్ని లైట్ తీసుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ అజ‌య్ దేవ‌గ‌ణ్ ఈ  రెండు సినిమాలు కూడా చూడ‌లేదుట‌. అందుకు కార‌ణం లేక‌పోలేదు.

సాధ‌ర‌ణంగా అజ‌య్ సినిమా చూడాల‌నుకుంటే రిలీజ్ అయిన వేవ్ లోనే చూసేస్తారుట‌. ఒక‌వేళ ఆ వేవ్ మిస్ అయితే త‌ర్వాత ఆ సినిమా చూడ‌రుట‌. ఇది చాలా కాలంగా అజ‌య్ కి ఉన్న అలవాటు. బాగా ఆల‌స్య‌మైన త‌ర్వాత సినిమా చూస్తే ఇంకా బెట‌ర్ అవుట్ ఫుట్ ఇవ్వొచ్చు  అన్న ఆలోచ‌న  బుర్ర‌ని తొలి చేస్తుందిట‌.

అందుకే రిలీజ్ అయిన త‌ర్వాత గ్యాప్ ఎక్కువ వ‌స్తే ఆ సినిమా మ‌ళ్లీ చూడ‌రుట‌. అయితే ఇక్క‌డ సూప‌ర్ స్టార్  మ‌హేష్ తో చిన్న లింక‌ప్ కుదిరింద‌ని చెప్పొచ్చు. మ‌హేష్ త‌న సినిమాలు తాను చూస్తాడు. కానీ అత‌ను చూసిన త‌ర్వాత అందులో లోపాలు వెదుకుతారు. ఇంకా బాగా చేస్తే బాగుండేద‌ని..ఆ సీన్ లో ఇంకా డెవ‌లెప్ మెంట్ చేయోచ్చ‌ని మైండ్ లో తిరుగుతుందిట‌.తాను న‌టించిన సినిమాలు చూస్తాడు. కానీ అదే ప‌నిగా ఎక్కువ సార్లు చూడ‌ర‌ని ఓ సంద‌ర్భంలో మ‌హేష్  తెలిపారు.
Tags:    

Similar News