అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ 'పుష్ప ది రైజ్' బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ సినిమా రానుందనే సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ సక్సెస్ అవడంతో ఇప్పుడు రెండో భాగం ''పుష్ప: ది రూల్'' పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్.. స్మగ్లింగ్ సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది 'పుష్ప: ది రైజ్' చిత్రంలో చూపించారు. సెకండ్ పార్ట్ లో శత్రువులను ఎదుర్కొని నేర సామ్రాజ్యాన్ని ఎలా పాలించడానేది ఆసక్తికరంగా చూపించబోతున్నారు.
నిజానికి 'పుష్ప' చిత్రాన్ని రెండు భాగాలుగా చేస్తున్నారనగానే అందరూ 'బాహుబలి' 'కేజీయఫ్' లతో పోలికలు పెట్టారు. అయితే 'పుష్ప: ది రైజ్' ను బాహుబలి తరహా ట్విస్ట్ తో ముగించలేదు. 'కేజేయఫ్' మాదిరిగా రెండో భాగంలో హీరో ఏం చేయబోతున్నాడనే ఇంట్రెస్ట్ ని ప్రేక్షకుల్లో కలిగించే ఎండింగ్ ని ఎంచుకున్నారు.
'పుష్ప-1' లో జాలి రెడ్డి - మంగళం శీను మరియ అతని భార్య దాక్షాయణి - భన్వర్ సింగ్ షెకావత్ వంటి విలన్ పాత్రలకు ముగింపు పలకలేదు. ఇవి రెండో భాగంలో పుష్పరాజ్ మీద ప్రతీకారం తీర్చుకోడాని ప్రయత్నాలు చేయనున్నాయి. దీనికి తోడు ''పుష్ప: ది రూల్'' చిత్రంలో ఓ ట్విస్ట్ ఉంటుందని ఇప్పుడు ఓ క్రేజీ గాసిప్ వైరల్ అవుతోంది.
పుష్పరాజ్ పక్కనే ఉండే కేశవ అలియాస్ మొండేలు పాత్రకు మొదటి భాగంలో ప్రాధాన్యత ఇచ్చారు. సినిమా మొత్తం ఆ పాత్రతోనే నెరేట్ చేయబడుతుంది. అయితే పార్ట్-2 లో కేశవ స్నేహితుడు పుష్పరాజ్ కు వెన్నుపోటు పొడిచి.. పెద్ద తలనొప్పిగా మారతాడని స్టోరీపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఈ ట్విస్ట్ పార్ట్-2 లో ఆసక్తికరమైన అంశమనే అనుకోవాలి. మొదటి భాగంలో హీరోని ఎదురులేని మనిషిగా చూపించడంతో విలన్ పాత్రలు తెలిపోయాయనే కామెంట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు సెకండ్ పార్ట్ ఎలివేట్ అవ్వాలంటే పుష్పరాజ్ ను ఢీకొట్టే పాత్రలు కూడా బలంగా ఉండాల్సిన అవసరం ఉంది.
సుకుమార్ సైతం మొదటి భాగంలో పాత్రలను మాత్రమే పరిచయం చేశామని.. 'పుష్ప' అసలు కథంతా సెకండ్ పార్ట్ లోనే ఉందని.. 'పుష్ప: ది రూల్' మాత్రం నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని స్పష్టత ఇచ్చారు. హిందీలో అంచనాలను మించి విజయం సాధించడంతో బాలీవుడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని కథలో కొన్ని కీలక మార్పులు చేసారని టాక్.
ముఖ్యగా 'పుష్ప 2' చిత్రంలో యాక్షన్ తో పాటుగా బలమైన ఎమోషన్స్ మీద సుకుమార్ ఫోకస్ పెడుతున్నారట. పుష్పరాజ్ కి తన తండ్రితో ఉండే అనుబంధాన్ని ఇందులో చూపించబోతున్నారట. అలానే 'ఊ అంటారా మావా' తరహాలోనే పుష్ప: ది రూల్ లో ఓ స్పెషల్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారని టాక్. ఏదైతేనేం అల్లు అర్జున్ కు ఈ సినిమాతో వచ్చిన పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ని నిలబెట్టే విధంగా సుకుమార్ రెండో భాగాన్ని రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది.