క్రేజీ గాసిప్‌ : అన్‌ స్టాపబుల్‌ రోజా.. నిజం ఎంత?

Update: 2022-10-26 04:34 GMT
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ చేస్తున్న అన్ స్టాపబుల్‌ టాక్ షో సూపర్ హిట్ అయ్యి సీజన్ 2 ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెల్సిందే. సీజన్ 2 లో కూడా స్ట్రీమింగ్‌ అవుతున్న రెండు ఎపిసోడ్స్ కి మంచి స్పందన వస్తోంది. బాలయ్య హోస్ట్‌ గా షో అనగానే చాలా మంది ఒకింత అనుమానం వ్యక్తం చేశారు.. కానీ అన్‌ స్టాపబుల్ అందరి నోళ్లు మూయించింది.

సీజన్ 2 లో గెస్ట్‌ లు చాలా స్పెషల్‌ గా ఉండాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నారు. మొదటి ఎపిసోడ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా వచ్చారు. లోకేష్ కూడా కొంత సమయం వచ్చి సందడి చేశారు. ఇక రెండవ ఎపిసోడ్ లో ఫలక్‌ నుమా దాస్ విశ్వక్ సేన్ మరియు డీజే టిల్లు ఫేం సిద్దు జొన్నలగడ్డ హాజరు అయిన విషయం తెల్సిందే.

మూడవ ఎపిసోడ్ గెస్ట్‌ ఎవరా అంటూ చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆ ఎపిసోడ్‌ కి సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయ్యి ఉంటుంది.. శుక్రవారం స్ట్రీమింగ్‌ అవ్వాల్సి ఉంది. మూడవ ఎపిసోడ్ గెస్ట్‌ విషయమై క్లారిటీ లేదు కానీ మంత్రి రోజా అన్‌ స్టాపబుల్ షో లో సందడి చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో మరియు ఇండస్ట్రీలో తెగ ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బాలయ్య టాక్ షో లో కచ్చితంగా మంత్రి రోజా పాల్గొనదు అంటూ కొందరు ఏపీ రాజకీయ ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. ఒక వేళ అదే జరిగితే రోజా కి ముఖ్యమంత్రి జగన్ నుండి తలంటు తప్పదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వ్యక్తిగతంగా తీసుకుంటే బాలయ్య మరియు రోజా ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ మధ్య ఒక సారి జబర్దస్త్‌ స్టేజ్ నుండి బాలయ్య కి రోజా కాల్‌ చేయడం.. ఆయన చాలా బాగా చిల్ గా మాట్లాడటం జరిగింది. రోజా అంటే ప్రత్యేక అభిమానం అన్నట్లుగా ఆయన మాట్లాడారు.

అలాంటి బాలయ్య షో లో ఆమె పాల్గొంటుంది అంటే నమ్మవచ్చు కానీ.. ఆమె ఇప్పుడు మంత్రి మరియు బాలయ్య టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కనుక కాస్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రేజీ గాసిప్‌ నిజమా కాదా అనేది తెలియాలి అంటే ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News