సినిమా కోసం సెట్ వేయటం ఏమి కొత్త విషయం కాదు. స్టూడియోలోనే అడివిని పుట్టించవచ్చు సముద్రాన్ని తీసుకురావచ్చు. టైటానిక్ లాంటి గొప్ప సినిమాలు కూడా హాలీవుడ్ సెట్లోనే తీసి నిజంగానే సముద్రంలో తీశారు ఏమో అన్నంత అద్భుతంగా నిర్మించారు జేమ్స్ కామెరూన్. అయితే మనలో అప్పుడుప్పుడు హైదరాబాద్ లో కూడా ఒక సముద్రం ఉంటే బాగుంటుంది కదా అని చాలా మందికి చాలాసార్లు అనిపించి ఉంటుంది. ఇప్పుడు ఆ ఆలోచన ఒక సినిమా ద్వారా తీరబోతుంది.
‘హైదరాబాద్ లో సముద్రం ఎందుకు లేదు హైదరాబాద్ లో సముద్రం సెట్ వేద్దాం సర్’ అని ఒక సినిమాలో జోక్ ఉంటుంది. ఇది అప్పటిలో ఒక జోక్ గా ఉండేది ఇప్పుడు నిజంగా నిజంకాబోతుంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రంగస్థలం 1985 సినిమా షూటింగ్ సెట్ పై జోరుగా సాగుతుంది. ఈ సినిమా కోసం గోదావరి పక్కనే ఉన్న ఒక ఊరులాంటి సెట్ 5 కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఊరుకి కొత్త హంగులు అద్దుతున్నారు రంగస్థలం టీమ్. కథ ప్రకారం ఈ ఊరులో జాలరులు ఎక్కువగా ఉంటారు పైగా ఈ ఊరు సముద్రానికి దగ్గరలో ఉండటం అవసరం అని చెబుతున్నారు. గోదావరి నది సముద్రంలో కలిసే చోట ఈ ఊరు ఉండటం చేత ఇప్పుడు వేసిన ఈ సెట్ కి విజువల్ ఎఫ్ఫెక్ట్స్ సహాయంతో సముద్రతీరం కానీ ఒక నది కానీ క్రియేట్ చేయబోతున్నారుని తెలుస్తోంది. 1985 లాంటి ఊరే కాదు నది పక్కన ఉండే వాతావరణం కూడా సెట్ వేస్తునట్లు ఒక టాక్ వచ్చింది. దానికి నీరుని VFXతో జతచేయబోతున్నారు.
సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న రంగస్థలం 1985 సినిమాకు నిర్మాతగా మైత్రీ మూవీ మేకర్స్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల చేయబోతున్నారు. మొత్తానికి సుకుమార్ సినిమా పుణ్యమా అని హైదరాబాద్కు కూడా సముద్రం రాబోతుందిని అనమాట.