కొందరు దర్శకులు నా మాట వినేవారు కాదు.. డెఫ్ అండ్ డంబ్ అంటూ వ్యాఖ్యానించాడు కీరవాణి. ఆయన నిన్న సంచలనాత్మకంగా చేసిన ట్వీట్లు.. ఆ క్షణంలో సంచలనం అనిపించాయి కాని.. నిధానంగా విమర్శకుల నుండి వాటిపై రియాక్షన్ వస్తోంది. ఈయనేమన్నా ప్రూవ్ చేయబడిన స్ర్కీన్ ప్లే రైటరా ఈయన మాట వినడానికి? లేకపోతే ఈయన రాసిన కథలకు ఏమన్నా ఆస్కార్లు వచ్చాయా? కెరియర్ ఫేడ్ అయిపోయి చేతిలో అవకాశాలు లేనప్పుడు గతంలో ఇళయరాజా కూడా ఇటువంటి మాటలే చెప్పాడు.. అంటూ విమర్శకులు కూడా అస్ర్తాలు సంధిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో రాజమౌళి హిట్టు సినిమాల్లో కూడా కీరవాణి కేవలం ఒకటే ఒకటి హిట్టు సాంగును ఇస్తున్నారు. ఒక ఆల్బమ్ లో 5 పాటలున్నప్పుడు.. కేవలం అందులో 1 పాట హిట్టవుతుంటే.. ఆ మ్యూజిక్ డైరక్టర్ హిట్ రేషియో ఏంటి? అటువంటప్పుడు అతను దర్శకుల హిట్ రేషియో గురించి కామెంట్లు చేయొచ్చా? బాహుబలి కాకుండా కీరవాణి ఈ మధ్య కాలంలో కంపోజ్ చేసిన ఇంటింటి అన్నమయ్యా.. అనామిక.. దిక్కులు చూడకు రామయ్య.. సైజ్ జీరో.. ఓం నమో వెంకటేశాయా.. సినిమాల్లోని ఒక్క పాటను టక్కుమని చెప్పండి చూద్దాం అంటున్నారు విమర్శకులు. వినసొంపైన సంగీతం కీరవాణి ఈ మధ్యకాలంలో కంపోజ్ చేయలేకపోవడం ఎంత నిజమో.. ఇతర దర్శకులు కూడా హిట్టు తీస్తున్నామనే అనుకుని ఫ్లాపులు తీయడం అంతే నిజం.
బాహుబలి ఈ రేంజులో విజయవంతం అవుతుందని కనీసం డైరక్టర్ కూడా అనుకోలేదని చెప్పిన కీరవాణి.. మరి రాజమౌళిని ఎవ్వరూ టచ్ చేయలేరని ఏ విధంగా చెప్పగలరు? ఏమో ఆ స్థాయిలో సినిమా తీసే యువకులు ఉత్సాహవంతులు ఎంతమందైనా రావొచ్చు.. దానికేముంది. ఏదేమైనా కూడా కీరవాణి ట్వీట్లలో నిజాయితీ పాళ్ళు ఉంటే ఉండొచ్చు కాని.. ఆయన పరస్పెక్టివ్ లో మాత్రం తప్పులున్నాయ్ బాస్!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/