దబంగ్ ప్రాంచైజ్ లో వచ్చిన మూడో సినిమా అతి కష్టం మీద వంద కోట్ల రూపాయల వసూళ్లకు చేరువ అవుతున్నట్టుగా ఉంది. ఈ సినిమా పై ముందస్తు అంచనాలు బాగానే ఉండినా, సినిమాకు డివైడ్ టాక్ తప్ప లేదు. దీంతో వసూళ్లపై ఆ ప్రభావం పడుతున్నట్టుగా ఉంది.
ఈ సినిమా క్రిస్మస్ రోజు వసూళ్లతో కలుపుకుంటే.. నెట్ వసూళ్ల విషయంలో వంద కోట్ల రూపాయలకు చేరువయ్యే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. సోమవారం నుంచి ఈ సినిమా వసూళ్లు చాలా వరకూ తగ్గుముఖం పట్టాయి. యాభై శాతం వరకూ కలెక్షన్లు డ్రాప్ అయ్యాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే క్రిస్మస్ హాలిడే సల్మాన్ ఖాన్ సినిమాకు కలిసి వచ్చే అంశమని అంచనా వేస్తూ ఉన్నారు.
దీంతో బుధవారం నాటికి ఈ సినిమా వంద కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించవచ్చు అని అంచనా వేస్తూ ఉన్నారు. సల్మాన్ సినిమా ఇలా కష్టపడి వంద కోట్ల రూపాయల వసూళ్ల స్థాయికి చేరుతున్నట్టుగా ఉంది.
మామూలుగా బాలీవుడ్ సినిమాలకు క్రిస్మస్ సీజన్ అనుకూలమైనదే. ఈ సీజన్లో భారీ సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అయితే ఈ ఏడాది సీఏఏ ఆందోళనల నేపథ్యంలో సల్మాన్ సినిమాకు వసూళ్లు తగ్గాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తూ ఉన్నారు. అలాగే దబంగ్ త్రీ సినిమా పొందిన టాక్ కూడా అంతంత మాత్రమే! దీంతో.. వసూళ్లు తగ్గాయి. వంద కోట్ల నెట్ వసూళ్లతో ఈ సినిమా సేఫ్ జోన్లోకి వచ్చినట్టేనా అనేది ఇంకా కొశ్చన్ మార్కే!