డైరెక్టర్ తేజ ముక్కోపి అన్నది తెలిసిన సంగతే. ఆయన అప్పుడప్పుడూ తన సినిమాలో నటీనటులపై చేయి కూడా చేసుకుంటాడని వార్తలు వస్తుంటాయి. ఇప్పటిదాకా ఆ విషయాన్ని ఏ హీరో హీరోయిన్ కూడా ఒప్పుకోలేదు. ఐతే ‘హోరాహోరీ’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమవుతున్న దక్ష మాత్రం తేజ నన్ను కొట్టాడంటూ గర్వంగా చెప్పుకుంటోంది. ఐతే తేజ తనను కావాలని కొట్టలేదని.. సినిమా కోసమే కొట్టాడని చెప్పింది దక్ష.
‘‘హోరాహోరీ సినిమాలో చాలా భావోద్వేగపూరితమైన సన్నివేశాలున్నాయి. నేను ఒక్కోసారి ఆ ఎమోషన్ చూపించలేకపోయేదాన్ని. దీంతో ఆయనొచ్చి ఓసారి చెంప మీద కొట్టారు. ముందు బాధపడ్డా అది సన్నివేశం కోసమే కదా అనిపించింది. తేజ ఏం చేసినా ఓకే. ఆయనంటే నాకు చాలా గౌరవం. ఆయన చేతుల మీదుగా ఎంతోమంది పరిచయమై మంచి పేరు సంపాదించారు. నేను కూడా వాళ్లలాగే ఎదుగుతానని ఆశిస్తున్నా’’ అని చెప్పింది దక్ష.
తెలుగు రాకున్నా నేర్చుకుని డబ్బింగ్ చెప్పుకోవడం గురించి మాట్లాడుతూ.. ‘‘తేజ గారు నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటే బావుంటుందన్నారు. అందుకే కష్టపడి భాష నేర్చుకున్నా. తెలుగు సరిగా పలకడం కోసం దాదాపు 30 తెలుగు సినిమాలు చూశా. మొత్తానికి నేను అనుకున్నదానికంటే బాగానే డబ్బింగ్ చెప్పా. రేపు ప్రేక్షకులకు కూడా అది నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అని దక్ష పేర్కొంది.