షార్ట్ అందాలతో క్లీన్ బౌల్డ్ చేస్తున్న అమ్మడు..!

Update: 2022-11-01 08:31 GMT
సినీ పరిశ్రమలో కొంతమంది భామలకు మొదటి సినిమాతోనే లక్ కలిసి వస్తుంది. మరికొంతమందికైతే వారెంత ప్రయత్నాలు చేసినా సరే బ్యాడ్ లక్ వెంటాడుతుంది. ముఖ్యంగా ఆడియన్స్ ని అలరించే అందం తమ సొంతమైనా సరే కెరియర్ లో జోష్ లేకపోతే ఆ హెడేక్ వేరేలా ఉంటుంది.

అలాంటి వారిలో అందాల భామ దక్ష నగార్కర్ ఒకరు. ఏకే రావు.. పీకే రావు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఆ సినిమాతో అలరించినా.. ఆ తర్వాత హోరా హోరీ సినిమాలో ఛాన్స్ అందుకుంది. తేజ డైరక్షన్ లో సినిమా చేసినా సరే అమ్మడికి లక్ కలిసి రాలేదు. తేజ తో సినిమా చేస్తే ఖచ్చితంగా ఆ హీరోయిన్స్ కి వరుస ఛాన్సులు వస్తాయి. కానీ దక్షకి ఆ సెంటిమెంట్ కూడా వర్క్ అవుట్ అవలేదు.

ఆ తర్వాత హుషారు.. జాంబి రెడ్డి సినిమాల్లో కూడా నటించింది దక్ష. అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో కూడా దక్ష ఒక చిన్న పాత్రలో నటించింది. హీరోయిన్ గా ఛాన్సులు రాకపోవడంతో చిన్న పాత్రలకు సై అనేస్తుంది అమ్మడు.

అయితే సినిమా అవకాశాలు లేకపోయినా తన గ్లామర్ తో ఆడియన్స్ ని మెప్పిస్తుంది దక్ష. తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసం గ్లామర్ ట్రీట్ అందిస్తూ క్రేజ్ తెచ్చుకుంటుంది ఈ బ్యూటీ. తన అందాల ఎర వేస్తూ ఫాలోవర్స్ ని తన బుట్టలో వేసుకుంటుంది అమ్మడు. లేటెస్ట్ గా మరో హాట్ ఫోటో షూట్ షేర్ చేసి హట్ టాపిక్ గా మారింది దక్ష.   

డెనిం షార్ట్, షర్ట్ బటన్స్ విప్పేసి మరి లోపల అందాలను ప్రదర్శిస్తుంది దక్ష నగార్కర్. అమ్మడి గ్లామర్ ట్రీట్ కి మినిమం లక్ష లైకులు అన్నా రావాల్సిందే. గ్లామర్ షోలో నో లిమిట్స్ అని హింట్ ఇస్తున్నా సరే సినిమాల్లో సరైన ఛాన్సులు అందుకోవట్లేదు దక్ష. అందాల ప్రదర్శనలో ఎలాంటి అభ్యంతరం లేని ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లని డిస్ట్రబ్ చేస్తుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే మాస్ మహరాజ్ రవితేజ నటిస్తున్న రావణాసుర సినిమాలో ఈ భామ లక్కీ ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తుంది. కత్తిలాంటి చూపులతో కుర్రాళ్ల గుండెల్లో మన్మధ బాణాలు గుచ్చేస్తున్న దక్షకి రావాల్సిన క్రేజ్ దక్కలేదని చెప్పొచ్చు. ఈ గ్లామర్ క్వీన్ చేస్తున్న ఈ స్కిన్ షో చూసి కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్ అవుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News